Actress: చలాకి పలుకుల చిన్నది.. వయ్యారాలు ఒలకబోస్తున్నది.. ఇంతకు ఈమె ఎవరో తెలుసా..?

హీరోయిన్స్ చిన్న నటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫాస్ట్ వరకు సోషల్ మీడియాలో నిత్యం చాలా రకాల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి.

Actress: చలాకి పలుకుల చిన్నది.. వయ్యారాలు ఒలకబోస్తున్నది.. ఇంతకు ఈమె ఎవరో తెలుసా..?
Actress

Updated on: Jan 10, 2023 | 9:14 AM

సినిమా తరాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ చిన్న నటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫాస్ట్ వరకు సోషల్ మీడియాలో నిత్యం చాలా రకాల ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఈ బ్యూటీలు కూడా అభిమానులను అలరించడానికి రకరకాల ఫోటోలను వీడియోలను షేర్ చేసి ఆకట్టుకుంటుంటారు. తాజాగా ఓ ముద్దుగుమ్మకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వయ్యారంతో కుర్రాళ్లకు వల వేస్తోంది ఈ భామ. ఇంతకు పై ఫొటోలో ఉన్న భామ ఎవరో గుర్తుపట్టారా..? క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఈ చిన్నది. హీరోయిన్ గా నటించలేదు కానీ యూట్యూబ్ లో మాత్రం సెన్సేషన్ ఈ భామ. ఇంతకు ఈ వయ్యారి ఎవరో కనిపెట్టారా..? పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ మరెవరో కాదు.

యూట్యూబ్ ను ఫాలో అయ్యే వారికి అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పెరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేత్తడి హారిక అంటే ఇంకా ఈజీగా గుర్తుపడతారు జనాలు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అందం అభినయం ఉన్న ఈ చిన్నది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక తెలుగులో బుల్లితెర బిగెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ లో పాల్గొని అలరించింది. తెలంగాణ భాషలో మాట్లాడుతూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఇక హారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టా లో రీల్స్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన రీల్ వైరల్ గా మారింది. ఇలా చీర కట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ వీడియో చేసి షేర్ చేసింది హారిక.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.