విలన్ అవతారమెత్తిన ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా.? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను

సౌత్ సినిమాకు యూనివర్స్‌ ల ట్రెండ్ పరిచయం చేసిన దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌. డ్రగ్స్ మాఫియా నేపధ్యంలో వరుస సినిమాలు చేసిన లోకేష్‌ కనగరాజ్‌. ఆ సినిమాలన్నింటినీ కనెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. ఖైదీ, విక్రమ్‌, లియో సినిమాల కథలను ఒకదానికితో ఒకటి కనెక్ట్ చేసేలా లీడ్స్ వదిలారు. ఈ సినిమాల్లో రోలెక్స్‌ లాంటి ఇంట్రస్టింగ్ గెస్ట్ రోల్స్‌ ను కూడా చూపించి అప్‌ కమింగ్ సినిమాల మీద అచనాలు పెంచేశారు.

విలన్ అవతారమెత్తిన ఈ స్టార్ హీరోని గుర్తుపట్టారా.? అమ్మాయిల డ్రీమ్ బాయ్ అతను
Actor

Updated on: Jun 05, 2025 | 7:22 PM

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు విలన్ పాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. పాత్రలో బలం ఉండే విలన్ పాత్రలు చేయడానికి వెనకాడటం లేదు. ఇప్పటికే చాలా మంది హీరోలు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా విలన్ అవతారమెత్తాడు. పై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని గుర్తుపట్టారా.? ఆయన ఓ స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆ స్టార్ హీరో ఇప్పుడు విలన్ గా మారాడు. పై ఫొటోలో ఉన్న హీరో అమ్మాయిల డ్రీమ్ బాయ్.. అతను ఎవరో గుర్తుపట్టారా.?

పై ఫొటోలో ఉన్న నటుడు ఎవరో కాదు మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ. ఈ స్టార్ హీరో ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. సాయి పల్లవి హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు నివిన్ పౌలీ . మలయాళంలో విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న నివిన్ పౌలీ. ఇప్పుడు విలన్ గా మారాడు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న బెంజ్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు నివిన్ పౌలీ . తాజాగా నివిన్ పౌలీ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వాల్టర్ అనే పాత్రలో నివిన్ పౌలీ కనిపించనున్నాడు.

రాఘవా లారెన్స్ నటిస్తున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లో భాగంగా రానుంది. లోకేష్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు తాజాగా సినిమాలోని విలన్ ను పరిచయం చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. వాల్టర్ గా నివిన్ పౌలీ లుక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఈ సినిమాను లోకేష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి