Tollywood: ఉదయ్ కిరణ్ పక్కన ఉన్న ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడు తెలుగులో హీరో.. ఫోటోస్ వైరల్..

|

Oct 20, 2024 | 12:06 PM

టాలీవుడ్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మనసంతా నువ్వే. ఇందులో చిన్నప్పుడు హీరో పాత్రలో నటించి.. తనదైన నటనతో మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.. ? ఇప్పుడు ఆ కుర్రాడు తెలుగులో యంగ్ హీరో. తాజాగా ఆ కుర్రాడి ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tollywood: ఉదయ్ కిరణ్ పక్కన ఉన్న ఈ చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడు తెలుగులో హీరో.. ఫోటోస్ వైరల్..
Anand Vardan
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తమదైన నటనతో అలరించిన చైల్డ్ ఆర్టిస్టులు తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయారు. తమ కామెడీ టైమింగ్, యాక్టింగ్‏కు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. అందులో కొందరు ఇప్పుడు వెండితెరపై హీరోహీరోయిన్లుగా రాణిస్తుంటే.. మరికొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కావ్య కళ్యాణ్ రామ్, తేజ సజ్జా, శ్రీవిద్య వంటి తారలు ఇప్పుడిప్పుడే సినీరంగంలో హీరోహీరోయిన్లుగా తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, సౌందర్య వంటి స్టార్స్ అందరితో నటించిన చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు హీరోగా అలరిస్తున్నాడు. పైన ఫోటోలో దివంగత హీరో ఉదయ్ కిరణ్ పక్కన నిల్చున్న చిన్నోడిని గుర్తుపట్టారా..? అప్పట్లో తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో తనదైన కామెడీతో అలరించాడు. విలక్షణ నటుడు జగపతి బాబు, సౌందర్య, మహేశ్వరి జంటగా నటించిన ప్రియరాగాలు సినిమాలో సౌందర్య కొడుకుగా కనిపించాడు. అలాగే వెంకటేశ్, మీనా నటించిన సూర్య వంశం సినిమాలో వెంకీ కొడుకుగా కనిపించాడు. అంతేకాకుండా హిందీలో అమితాబ్, సౌందర్య నటించిన సూర్యవంశం సినిమా రీమేక్ లోనూ కనిపించాడు.

తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో బాలనటుడిగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ హిట్ మనసంతా నువ్వే చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించాడు. ఆ చిన్నోడి పేరు ఆనంద్ హర్షవర్దన్. తెలుగులో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ చిన్నోడు.. ప్రముఖ కంపోజర్, ప్లే బ్యాక్ సింగర్ పిబీ శ్రీనివాస్ మనవడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాలరామాయణం సినిమాలో వాల్కికీ, బాల హనుమాన్ పాత్రలు పోషించాడు. అలాగే వెంకటేశ్ నటించిన ప్రేమించుకుందాం రా సినిమాలో వెంకీ మేనల్లుడిగా కనిపించాడు.

బాలనటుడిగా దాదాపు 25 సినిమాలకు పైగా నటించిన ఆనంద్.. ఇప్పుడు హీరోగా వెండితెరపై అలరిస్తున్నాడు. హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసిన ఆనంద్.. ఆన్ ది వే సినిమాలో హీరోగా నటించాడు. అలాగే నిదురించు జహాపన అనే సినిమాలోనూ నటించాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఆనంద్.. తన చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తున్నాడు.

ఇది చదవండి : Tollywood: వణుకుపుట్టించే థ్రిల్లర్ మూవీ.. ఈ సినిమాను అస్సలు మిస్సవద్దు..

Tollywood: ఈ అరాచకం ఏందీ సామి.. ఎన్టీఆర్‏తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ.. ? ఇప్పుడు చూస్తే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.