మిస్ ఆంధ్ర విన్నర్.. తెలుగులో టాప్ హీరోయిన్.. కట్ చేస్తే సినిమాలు లేక ఇప్పుడు ఇలా..

సినీరంగంలో స్టార్ నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఇతర రంగాల్లో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న పలువురు ముద్దుగుమ్మలు.. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్లుగా మారారు. కానీ కొంతమంది మాత్రం చేసిన కొన్ని సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

మిస్ ఆంధ్ర విన్నర్.. తెలుగులో టాప్ హీరోయిన్..  కట్ చేస్తే సినిమాలు లేక ఇప్పుడు ఇలా..
Actress

Updated on: Jan 25, 2025 | 12:19 PM

చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను అలరించి స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటుంటారు. తక్కువ సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. అలాగే తమ అందం అభినయంతో మెప్పించి స్టార్స్ అవుతారు అని అనుకునేలోగా ఇండస్ట్రీ నుంచి మాయం అవుతూ ఉంటారు. అలాంటివారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. పైన  కనిపిస్తున్న హీరోయిన్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కానీ హీరోయిన్ గా ఎక్కువకాలం రాణించలేకాపోయింది. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత అవకాశాలు తగ్గడంతో సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. అయినా కూడా ఈ చిన్నదానికి అనుకుంతాగా గుర్తింపు రాలేదు. దాంతో ఇండస్ట్రీ నుంచి మెల్లగా మాయం అయ్యింది.

తెలుగులో సినిమాలు తగ్గడంతో కన్నడ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా ఈ అమ్మడికి కలిసి రాలేదు. దాంతో మెల్లగా సినిమాలకు దూరం అయ్యింది. ఆమె ఎవరో కాదు క్రేజీ బ్యూటీ.. ప్రస్తుతం వివాదాలతో సావాసం చేస్తున్న పూనమ్ కౌర్. 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం తో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

ఆ తరువాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్ మొదలైన చిత్రాలలో నటించింది. ఆతర్వాత శౌర్యం సినిమాలో గోపీచంద్ సిస్టర్ గా నటించింది. అలాగే మరికొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా, కొన్ని సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించింది. 2018 తర్వాత పూనమ్ నటించిన సినిమాలు రిలీజ్ కాలేదు. ఇక ఈ అమ్మడు ఇప్పుడు వివాదాలతో సావాసం చేస్తుంది. తెలుగులో స్టార్ డైరెక్టర్ పై షాకింగ్ కామెంట్స్ చేసి ఈ మధ్య వార్తల్లో నిలిచింది. అలాగే సమాజంలో జరిగే అరాచకాల పై పూనమ్ తన గొంతు విప్పుతూ ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.