Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దేవుడా..! నితిన్ హీరోయిన్ ఎంతలా మారిపోయింది.. ఇప్పుడు ఇంత హాట్‌గా

ఒకప్పుడు తెలుగు సినీరంగంలో ఆమె చాలా పాపులర్. తొలి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యింది. అందం, అభినయంతో కుర్రాళ్ల మతిపోగొట్టేసింది. ఆమె మరెవరో కాదు.. మిస్త్రీ చక్రవర్తి. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు.గుర్తుపట్టలేరు కదా.. 2013లో పొరిచేయ్ అనే సినిమాతో బెంగాలీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. తొలి చిత్రంతోనే అక్కడ చాలా ఫేమస్ అయ్యింది.

ఓరి దేవుడా..! నితిన్ హీరోయిన్ ఎంతలా మారిపోయింది.. ఇప్పుడు ఇంత హాట్‌గా
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2025 | 11:23 AM

ఒకే ఒక్క సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుని ఇండస్ట్రీకి దూరం అయినా హీరోయిన్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ వయ్యారి భామ ఒకరు. అందం, అభినయంతో ఫస్ట్ మూవీతోనే కట్టిపడేసిన ఈ సొగసరి. ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీలో అంతగా ఆఫర్స్ అందుకోలేదు. కానీ ఇప్పటికీ తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. చాలాకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు. ఇంతకీ ఆమె మీకు గుర్తుందా..? టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిన్నదాన నీకోసం మూవీతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తనే మిస్త్రీ చక్రవర్తి.

ఈ పేరు చెబితే యూత్ అసలు గుర్తుపట్టలేరు. కానీ నితిన్ నటించిన చిన్నదాన నీకోసం సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. మిస్త్రీ చక్రవర్తి బెంగాళీ అమ్మాయి. 2013లో పొరిచేయ్ అనే సినిమాతో బెంగాలీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే అక్కడ చాలా ఫేమస్ అయ్యింది. బెంగాలీలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు నితిన్ నటించిన చిన్నదాన నీకోసం మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. కానీ మిస్త్రీ చక్రవర్తికి మంచి క్రేజ్ వచ్చింది. అమాయకపు చూపులు.. తనదైన నటనతో అందర్ని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఫస్ట్ మూవీతోనే కట్టిపడేసిన ఈ భామకు తెలుగులో ఈ బ్యూటీ వరుస ఆఫర్లు వస్తాయనుకున్నారు.

కానీ చిన్నదాన నీకోసం సినిమా తర్వాత మరో మూవీ చేయలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు హిందీలో కాంచీ అనే సినిమాలో నటించింది. ఆ మధ్య ఓ సాథియా అనే సినిమాలో కనిపించింది. ఈ మూవీ రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఆ బ్యూటీ.. ఇప్పుడు మాత్రం సన్నజాజి తీగల మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వయసు 36 ఏళ్లు. ఇప్పటికీ అచ్చం పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది మిస్తీ. ప్రస్తుతం నెట్టింట వరుస ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by MISHHTI (@mishtichakravarty)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..