Sindu Tolani: ఒకప్పుడు టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా.. ఏం చేస్తుందో తెలుసా..?

ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగిన తారలు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అందం, అభినయంతో మెప్పించిన పలువురు భామలు.. తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడు మీకు గుర్తుందా..? కొన్నాళ్ల క్రితం తెలుగులో ఫేమస్ హీరోయిన్. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?

Sindu Tolani: ఒకప్పుడు టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా.. ఏం చేస్తుందో తెలుసా..?
Sindu Tulani

Updated on: Jun 22, 2025 | 8:34 AM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుందా.. ? తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసింది. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కంటెంట్ చిత్రాలోత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? 2003లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఐతే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తనే ముంబై బ్యూటీ సింధు తులానీ.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన అతనొక్కడే సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత తెలుగులో గౌతమ్ SSC, పౌర్ణమి, పోతేపోనీ, బతుకమ్మ, హరేరామ్ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాలేదు. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాలలో నటించింది.

హీరోయిన్ గానే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలంగాణ బతుకమ్మ నేపథ్యంలో వచ్చిన బతుకమ్మ చిత్రంలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. కొన్నాళ్లపాటు సినిమాల్లో మెరిసిన ఈ తార.. 2011లో ఆది ప్రేమ కావాలి చిత్రంలో నటించింది. అలాగే ఇష్క్ సినిమాలో నితిన్ అక్కగా కనిపించిన ఆమె.. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ వదినగా కనిపించింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలలో నటించింది.

అయితే 2017 నుంచి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది సింధు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. అలాగే సోషల్ మీడియాకు సైతం ఆమె దూరంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ అమ్మడుకు సంబంధించిన వివరాలు అంతగా తెలియరాలేదు. కానీ తాజాగా ఆమె ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన చేతన్ అనే వ్యక్తిని సింధు తులానీ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి పాప ఉన్నట్లు సమాచారం.

Sindu Tulani Fam

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..