Actress : పవన్ కళ్యాణ్, రవితేజలతో బ్లాక్ బస్టర్స్.. కట్ చేస్తే.. సినిమాలకు దూరంగా క్రేజీ హీరోయిన్..

సౌత్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే సక్సెస్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చింది.

Actress : పవన్ కళ్యాణ్, రవితేజలతో బ్లాక్ బస్టర్స్.. కట్ చేస్తే.. సినిమాలకు దూరంగా క్రేజీ హీరోయిన్..
Meera Jasmine

Updated on: Dec 05, 2025 | 8:28 AM

దక్షిణాది సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. సినీరంగంలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే వరుస హిట్స్ అందుకుంది. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అప్పట్లో ఈ ముద్దుగుమ్మకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా రవితేజతో కలిసి వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ఇంతకీ పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ మీరా జాస్మిన్. అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు ముందే తమిళం, మలయాళం భాషలలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..

తెలుగులో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రవితేజ జోడిగా భద్ర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో తెలుగులో మీరా జాస్మిన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన గుడుంబా శంకర్ సినిమాలో నటించింది. ఈ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. బాలయ్యతో కలిసి మహారధి సినిమాలో నటించింది. తెలుగులో రారాజు, యమగోల మళ్ళీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటి పిల్లాడు, బంగారు బాబు, అ ఆ ఇ ఈ, ఆకాశ రామన్న వంటి సినిమాల్లో కనిపించింది.

ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..

పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. దాదాపు పదేళ్లపాటు అడియన్స్ ముందుకు రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇటీవలే విమానం సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు ఇన్నాళ్లు పద్దతిగా సినిమాలతో అలరించిన మీరా జాస్మిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో మతి పోగొడుతుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..