నమ్మండ్రా బాబు..! కంచరపాలెం సినిమాలో చేసింది ఈ హాట్ బ్యూటీనే

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ గా నిలుస్తుంటాయి. అంతే కాదు ఆ సినిమాలు ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ మిగిలిపోతుంటాయి. అలాంటి సినిమాల్లో కేరాఫ్ కంచరపాలెం సినిమా ఒకటి. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందమైన కథతో వెంకటేష్ మహా అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.

నమ్మండ్రా బాబు..! కంచరపాలెం సినిమాలో చేసింది ఈ హాట్ బ్యూటీనే
Kancharapalem Movie

Updated on: Apr 23, 2025 | 11:13 AM

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయలను అందుకుంటూ ఉంటాయి. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా.. ప్రముఖ దర్శకుడి దర్శకత్వం కాకపోయినా.. కథను బట్టి సినిమా రేంజ్ మారిపోతుంది. ఇప్పటికే చాలా సినిమాలు దీని నిరూపించాయి. కొన్ని సినిమాలు పాన్ ఇండియా హిట్స్ గానూ నిలిచాయి. వాటిలో కేరాఫ్ కంచెరపాలెం ఒకటి. చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సినిమా కేరాఫ్ కంచెరపాలెం. వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందరు కొత్త నటులు.. అక్కడి లోకల్ వాళ్ళతో ఈ సినిమాను తెరకెక్కించాడు వెంకటేష్. ఈ మూవీలో దర్శకుడు చూపించిన ప్రతి పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2018లో వచ్చిన ఈ సినిమాలో భార్గవి అనే పాత్రలో నటించిన అమ్మాయి గుర్తుందా.? ఆమె పేరు ప్రణీత పట్నాయక్.

ఇది కూడా చదవండి :అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు.. ఎమోష్నలైన స్టార్ హీరోయిన్ 

ఆ సినిమాలో మిడిల్ క్లాస్ యువతిగా కనిపించిన ప్రణీత.. తన నటనతో మెప్పించింది. సినిమాలో కనిపించేది కొంతసేపే అయినా.. ఆమె పాత్ర ప్రేక్షకులకు గుర్తుంది పోతుంది. ఈ చిన్నది ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా సీతారామం సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. అలాగే ‘నెట్’ సినిమాలో రాహుల్ రామకృష్ణ భార్యగా కనిపించింది. అందులో ఓ రొమాంటిక్ సీన్ లో కూడా చాలా బోల్డ్ గా నటించింది. చివరిగా సన్నీడియోల్ నటించిన జాట్ సినిమాలో మెరిసింది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తొలి సినిమాలో అందాల ఆరబోతకు అంత లేదు కాబట్టి సరిపోయింది లేకుంటే తన అందాలతో ప్రేక్షకుల మతిపోగొట్టేది ఈ చిన్నది. ఆమె ఇన్ స్టా గ్రామ్ ఫోటోలు చూస్తే ఎవరైనా అదే ఆంటారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముగ్గురు అక్కచెల్లెళ్లతో నటించిన ఏకైక హీరో.. అన్ని సినిమాలు హిట్టే

రోజూ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. నెట్టింట సెగలు పుట్టిస్తోంది ప్రణీత. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఓ వైపు చీరకట్టులో ఆకట్టుకుంటూనే మరో వైపు మోడ్రన్ డ్రస్సులో కుర్రాళ్లను కవ్విస్తుంది. తాజాగా ఈ చిన్నదాని బీచ్ ఫోటోలు వైరల్ గా మారాయి. అందాలు వడ్డిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ప్రణీత. ఆ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి రచ్చ మావ..! చేసింది చిన్న పాత్ర.. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హాట్ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.