Tollywood: తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. హాలీవుడ్ రేంజ్‏లో ఫాలోయింగ్.. కట్ చేస్తే.. బుల్లితెరపై..

సినీరంగంలో సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న చాలామంది తారలు.. ఇప్పుడు బుల్లితెరపై సెటిల్ అయ్యారు. వరుస సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మలు.. ఇప్పుడు వయసుకు తగిన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ ఓ నటి మాత్రం ఇప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Tollywood: తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. హాలీవుడ్ రేంజ్‏లో ఫాలోయింగ్.. కట్ చేస్తే.. బుల్లితెరపై..
Actress

Updated on: Jan 25, 2025 | 3:30 PM

సాధారణంగా సినీరంగంలో ఒక్క సినిమాతోనే సెన్సేషన్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తొలి చిత్రంలోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుని స్టార్ స్టేటస్ అందుకోవాల్సిన ముద్దుగుమ్మలు అనుహ్యంగా సినిమాలకు దూరమవుతుంటారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. వెండితెరపై ఓ వెలుగు వెలిగి ఇప్పుడు బుల్లితెరపై బిజీ నటిగా కొనసాగుతున్నారు. అలాంటి వారిలో ఈ తార ఒకరు. తెలుగు సినిమాతోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకే దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె హిందీలో పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఆమె మరెవరో కాదు.. మధురిమ తూలి. తెలుగులో చేసింది ఒక్క సినిమానే కానీ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించింది. కానీ స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది.

2008లో విలక్షణ నటుడు జగపతి బాబు, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం హోమం. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మధురిమ. ఈ సినిమాతో కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ఆ తర్వాత తమిళంలో రెండు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి పిలుపు రాకపోవడంతో అక్కడికి వెళ్లిపోయి వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉండిపోయింది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఇంగ్లీష్ చిత్రాల్లో నటించింది.

ఇక హిందీలో పలు సీరియల్స్ చేసి చాలా ఫేమస్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ సీజన్ 13లో పాల్గొంది. ప్రస్తుతం మధురిమ వయసు 37 సంవత్సరాలు. గతంలో తన స్నేహితుడిని ప్రేమించిన ఈ హీరోయిన్.. మనస్పర్థలతో విడిపోయారు. ఇప్పటికీ సింగిల్ గా ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటుంది.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..