
సినిమా సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. స్టార్ హీరోల ఫొటోలతో పాటు హీరోయిన్స్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోకు సంబందించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన సినిమాలకు.. ఆయన నటనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరో ఎవరో గుర్తు పట్టారా.? లుక్ మొత్తం మార్చేసి చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న హీరో ఎవరో కనిపెట్టండి చూద్దాం.! చాలా మంది కనిపెట్టలేకపోయారు గురూ. మీరనుకుంటున్న హీరో మాత్రం కాదు ఆయన. సరే మీకోసం ఓ క్లూ.. తెలుగు, తమిళ్, హిందీ భాషలతో పాటు హాలీవుడ్ లోనూ నటించి మెప్పించాడు ఆ స్టార్ హీరో. ఇంతకు ఆయన ఎవరెంటే..
పై ఫొటోలో కనిపిస్తున్న హీరో మరెవరో కాదు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న స్టార్ హీరో ధనుష్. ధనుష్ గురించి ఎంత చెప్పిన తక్కువే సినిమా సినిమాకు ఆయన చూపించే వేరియేషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తెలుగులోనూ ధనుష్ నటించిన సినిమాలు డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.
తెలుగులో 3, రఘువరన్ బీటెక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు ధనుష్. అలాగే సార్ అనే స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ధనుష్ ప్రస్తుతం తన 50వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.