
ఎంతో మంది హీరోయిన్స్ తెలుగులో మెరుపు తీగలు చాలా మంది ఉన్నారు. వారిలో ఏ అమ్మడు ఒకరు. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఉన్నట్టుండి సినిమాలకీ దూరం అయ్యింది. కట్ చేస్తే ఇలా కనిపించింది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? తెలుగులో నాగార్జున, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ తదితర హీరోలతో నటించింది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుందీ అందాల తార. అంతేకాదు వివాహానికి ముందే సినిమాలకు గుడ్ డై చెప్పేసి అభిమానులను షాక్ కు గురిచేసింది. ఆ వెంటనే తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసింది.
పెళ్లి తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక భావనలోనే మునిగిపోయిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు సనాఖాన్. ముంబైకు చెందిన సనాఖాన్ కెరీర్ ఆరంభంలో పలు హిందీ సినిమాలు, సీరియల్స్ లో నటించింది. కల్యాణ్ రామ్ కత్తి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నాగార్జున గగనం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ తో కలిసి మిస్టర్ నూకయ్య సినిమాలోనూ నటించింది. పలు తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది.
హిందీలో అయితే సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. 2019లో విశాల్ నటించిన అయోగ్య సినిమాలో చివరి సారిగా కనిపించింది. ఆతర్వాత ఉన్నట్లుండి సినిమాల నుంచి తప్పుకుంది సనాఖాన్. దుబాయ్ కు చెందిన అనస్ సయ్యద్ తో కలిసి నిఖా పక్కా చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు సయ్యద్ తారిఖ్ జమీల్ అనే బాబు. ఎక్కువగా ఆధ్యాత్మిక యాత్రలో మునిగి తేలుతోన్న సనాఖాన్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తి దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సనాఖాన్ ఫ్యామిలీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.