హీరోయిన్స్ ఫోటోలకు సోషల్ మీడియాలో యమా డిమాండ్ ఉంటుంది. హీరోయిన్స్ ఫోటోలను షేర్ చేయడానికి నెటిజన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమ ఫెవరెట్ హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు అభిమానులు. మరోవైపు హీరోయిన్స్ కూడా అభిమానులను ఆకట్టుకునేలా తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఓ ముద్దుగుమ్మ చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమెకు పాన్ ఇండియా లెవల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోలతో సరిసమానంగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..
పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు స్టార్ హీరోయిన్ త్రిష. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది త్రిష. తెలుగులో ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో త్రిష దాదాపు అందరు హీరోల సరసన నటించి మెప్పించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ సరసన త్రిష. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌లతో కూడా నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో త్రిష టాలీవుడ్ కు దూరంగా ఉంటుంది.
ఎక్కువగా ఆమె తమిళ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది. ఇటీవలే పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో నటించిన ఐశ్వర్య రాయ్‌తో అందం విషయంలో పోటీ పడింది. అలాగే చివరిగా లియో సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అదేవిధంగా గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ఇప్పుడు త్రిష మరోసారి తెలుగులో నటించనుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో త్రిష హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.