
టాలీవుడ్ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హీరో సుమంత్. అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన సుమంత్.. అంతగా క్లిక్ అవ్వలేదు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రలు పోషిస్తున్న సుమంత్.. ఒకప్పుడు అందమైన ప్రేమకథలతో మెప్పించాడు. ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్స్ గా మిగిలిపోయాయి. అందులో ప్రేమకథ ఒకటి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ప్రేమకథ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. హీరోగా తొలి చిత్రానికే ప్రశంసలు అందుకున్నాడు. 1999లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇందులో సుమంత్ సరసన నటించిన హీరోయిన్ గుర్తుందా.. ? ఆమె పేరు అంతరా మలి.
ప్రేమకథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. నటనపరంగానూ మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వకముందే ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ప్రముఖ భారతీయ ఫోటోగ్రాఫర్ జగదీష్ మాలి కుమార్తె ఆమె. 1998లో వచ్చిన ధూండ్తే రెహ్ జావోగే చిత్రంతో సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. ఆ సినిమా పరాజయం అయినప్పటికీ తెలుగుతోపాటు హిందీలోనూ వరుస ఆఫర్స్ అందుకుంది. మస్త్ (1999), రోడ్ (2002), కంపెనీ (ఆమె అజయ్ దేవ్‌గన్ భార్యగా నటించింది), దర్నా మన హై (2003) బన్నా చాహ్తీ హూన్ చిత్రాలలో నటించింది. తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు రాకపోయినప్పటికీ హిందీలో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంది.
ఆ తర్వాత కొన్నేళ్లకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. 2005 నుంచి ఆమె సినీ గ్లామర్ ప్రపంచంలో సైలెంట్ అయ్యింది. 2009లో ప్రముఖ జీక్యూ మ్యాగజైన ఎడిటర్ చే కురియన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. అంతరా మలి సోషల్ మీడియాకు దూరంగా ఉంది. చాలా కాలం తర్వాత ఆమె ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆమె న్యూలుక్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.
Premakatha Movie
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..