Tollywood: ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. మాఫియా డాన్‏తో ఫ్రెండ్షిప్.. చివరకు జైల్లో అలా..

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్. అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారు హృదయాలను దొచేసింది. తక్కువ సమయంలోనే తెలుగు సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. కానీ ఆమె చేసిన కొన్ని పొరపాట్లతో కెరీర్ పూర్తిగా నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుందా.. ?

Tollywood: ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్.. మాఫియా డాన్‏తో ఫ్రెండ్షిప్.. చివరకు జైల్లో అలా..
Taj Mahal Movie

Updated on: Jan 24, 2025 | 7:31 PM

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ కొత్తగా వెండితెరకు పరిచయం అయ్యారు. అతి తక్కువ సమయంలోనే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఈ హీరోయిన్ ఒకరు. అప్పట్లో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పరిచయం చేసిన హీరోయిన్లలో ఆమె ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మను తెలుగు తెరకు పరిచయం చేశారు రాఘవేంద్రరావు. పైన ఫోటోను చూస్తున్నారా..? శ్రీకాంత్ హీరోగా నటించిన అందమైన ప్రేమ కథ చిత్రం తాజ్ మహల్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసిన ఈ అమ్మడుకు.. అదే సమయంలో హిందీలోనూ అవకాశాలు అందుకుంది.

ఆ హీరోయిన్ పేరు మోనికా బేడి. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా చబ్బేవాల్ గ్రామంలో జన్మించిన ఈ చిన్నది ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు 1979లో నార్వేలోని డ్రామెన్‌కి మారారు. తెలుగులో తాజ్ మహల్, శివయ్య , సోగ్గాడి పెళ్ళాం, సర్కస్ సత్తిపండు, చూడాలని వుంది (1998) స్పీడ్ డాన్సర్‌ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత సురక్ష మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీకి అప్పట్లో మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ కెరీర్ పీక్ లో ఉండగానే పలు వివాదాల్లోనూ చిక్కుకుని సినిమాలకు దూరమయ్యింది. సెప్టెంబరు 2002లో, నకిలీ పత్రాలపై దేశంలోకి ప్రవేశించినందుకు పోర్చుగల్‌ లో ఆమెతో పాటు అబూ సలేం అనే భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్టు చేశారు. ఆ తరువాత ఆమె జైలు శిక్ష సైతం అనుభవించింది. 2006లో, ఫేక్ పేరుతో పాస్‌పోర్ట్ తెచ్చుకున్నందుకు ఈ నటిని భారత న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. ఇలా వరుస వివదాల్లో చిక్కుకుని కెరీర్ నాశనం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..

Follow Us