AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aa Naluguru Movie: ఆ నలుగురు సినిమాలో అప్పడాలు అమ్మిన చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ఇప్పటికే కొందరు బాలనటీనటులు హీరోహీరోయిన్లుగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు జోడిలుగా కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో కూడా ఇండస్ట్రీలో హీరోగా దూసుకుపోతున్నాడు. అతడే విశ్వ కార్తికేయ. గుర్తుకు వచ్చిందా..? అయితే ఆ నలుగురు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్, ఆమని జంటగా నటించిన సినిమా ఆ నలుగురు.

Aa Naluguru Movie: ఆ నలుగురు సినిమాలో అప్పడాలు అమ్మిన చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడు టాలీవుడ్ హీరో..
Aa Naluguru
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2024 | 9:21 PM

Share

సినీ పరిశ్రమలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన ఎంతో మంది ఇప్పుడు హీరోలుగా వెండితెరపై రాణించేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కొందరు బాలనటీనటులు హీరోహీరోయిన్లుగా ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు జోడిలుగా కనిపిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో హీరో కూడా ఇండస్ట్రీలో హీరోగా దూసుకుపోతున్నాడు. అతడే విశ్వ కార్తికేయ. గుర్తుకు వచ్చిందా..? అయితే ఆ నలుగురు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. విలక్షణ నటుడు రాజేంద్ర ప్రసాద్, ఆమని జంటగా నటించిన సినిమా ఆ నలుగురు.

డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ తెరకెక్కించిన ఈ సినిమాలో రాజా, శుభలేఖ సుధాకర్, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. ఇందులో విశ్వ కార్తికేయ అప్పడాలు అమ్ముకునే అబ్బాయిగా కనిపించాడు. ఇందులో విశ్వకార్తికేయ, రాజేంద్ర ప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కాకుండా తెలుగులో దాదాపు 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా కనిపించాడు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు ఇలా ఎంతో మంది సినిమాల్లో కనిపించాడు. రాజశేఖర్ నటించిన గోరింటాకు, రోహిత్ జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, శ్రీకాంత్ లేత మనసులు, మోహన్ బాబు శివ శంకర్, బాలయ్య బాబు అధినాయకుడు చిత్రాల్లో విశ్వ కార్తికేయ బాలనటుడిగా కనిపించాడు.

బాలనటుడిగా అనేక అవార్డులు కూడా అందుకున్నాడు. ఇక పెద్దయ్యాక హీరోగా సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నడాు. జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇటీవలే కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇందులో ఆయూషి పటేల్ కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. విశ్వ కార్తికేయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్.. వేణుగోపాల్ కీలక కామెంట్స్
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్.. వేణుగోపాల్ కీలక కామెంట్స్
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు
గోపీచంద్ సినిమాలో కొత్త హీరోయిన్.. ఎవరీ అనార్కలి? ఫొటోస్ ఇదిగో
గోపీచంద్ సినిమాలో కొత్త హీరోయిన్.. ఎవరీ అనార్కలి? ఫొటోస్ ఇదిగో