
సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్స్ అందుకున్న హీరోలలో వినీత్ ఒకరు. 1996లో వినీత్ సృష్టించిన సంచలనం పూర్తిగా వేరే విషయం. “ప్రేమ దేశం” సినిమాతో అతను రాత్రికి రాత్రే దక్షిణాదిన స్టార్ అయ్యాడు. అతను ఒకప్పుడు తెలుగు చిత్రాలలో నటించాడు, కానీ “ప్రేమ దేశం” తమిళ డబ్బింగ్ వెర్షన్‌తోనే అతను సంచలనం సృష్టించాడు. ఇందులో అతను కార్తీక్ పాత్రను పోషించాడు. ఈ ఒక్క సినిమా అతనికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. 1993లో క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన “సరిగమలు” చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించాడు.
ఆ తర్వాత “ఏవండి పెళ్లి చేసుకోండి” , “ఆరో ప్రాణం” వంటి చిత్రాలలో కనిపించాడు. అయితే రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన “రుక్మిణి” అతనికి తెలుగులో మరింత పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ప్రేమ పల్లకి’, ‘ప్రియురాలు’, ‘పాడుతా తీయగా’, ‘వైఫ్ ఆఫ్ వరప్రసాద్’ చిత్రాల్లో నటించారు. అయితే ఎన్ని సినిమాల్లో నటించినా స్టార్‌డమ్ సాధించలేకపోయాడు. “ప్రేమ దేశం” సృష్టించిన సెన్సేషన్.. ఆ తర్వాత మరో సినిమా తీసుకురాలేదు. నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత సహాయ పాత్రలు పోషించారు.
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‌బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..
రాజశేఖర్ నటించిన ‘మా అన్నయ్య’ సినిమాలో తమ్ముడిగా నటించాడు. ‘అమ్మాయి కోసం’ సినిమాలో రవితేజ స్నేహితుడిగా, ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాలో శ్రీనివాస్ నాయుడుగా నటించాడు. అబ్బాస్ చిత్రం “నీ ప్రేమకై” తో ఆయన మరో హిట్ సాధించారు. సంక్రాంతి దర్శకుడు ముప్పలినేని శివ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో లయ కథానాయికగా నటించింది. ఆయన చివరిగా నితిన్ నటించిన తెలుగు చిత్రం “రంగ్ దే”లో నటించారు. ఈ చిత్రంలో ఆయన నితిన్ అన్నయ్యగా నటించారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ మలయాళం చిత్రాల్లో నటిస్తున్నారు. నటుడిగానే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు కేరళలో నివసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..