Sambaram Movie: బాబోయ్.. సంబరం మూవీ హీరోయిన్ ఈ రేంజ్‏లో మారిందేంటీ..? గుర్తుపట్టడం కష్టమే..

|

Jun 12, 2024 | 3:09 PM

చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉన్న అమ్మాయి.. అబ్బాయి.. ఆ తర్వాత ప్రేమ, మనస్పర్థలు కారణంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చిందనేది ఈ మూవీ కథాంశం. ఇందులో నితిన్, నిఖిత జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నిఖిత తుక్రాల్ అప్పట్లో తెలుగు కుర్రాళ్ల ఫేవరేట్ క్రష్ కూడా. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది.

Sambaram Movie: బాబోయ్.. సంబరం మూవీ హీరోయిన్ ఈ రేంజ్‏లో మారిందేంటీ..? గుర్తుపట్టడం కష్టమే..
Sambaram Movie
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన ప్రేమకథ చిత్రాల్లో సంబరం ఒకటి. డైరెక్టర్ దశరథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2003లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో నితిన్ జోడిగా నిఖిత కథానాయికగా నటించింది. అలాగే బెనర్జీ, సీత, గిరిబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు కీలకపాత్రలు పోషించగా.. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ ఇప్పటికీ శ్రోతలను మైమరపిస్తున్నాయి. చిన్ననాటి నుంచి స్నేహితులుగా ఉన్న అమ్మాయి.. అబ్బాయి.. ఆ తర్వాత ప్రేమ, మనస్పర్థలు కారణంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవాల్సి వచ్చిందనేది ఈ మూవీ కథాంశం. ఇందులో నితిన్, నిఖిత జోడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా నిఖిత తుక్రాల్ అప్పట్లో తెలుగు కుర్రాళ్ల ఫేవరేట్ క్రష్ కూడా. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉండేది.

అందం, అభినయంతో తక్కువ సమయంలోనే తెలుగులో మంచి ఫేమ్ క్రియేట్ చేసుకుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించిచంది. ఈ సినిమానే కాకుండా తెలుగులో నిఖిత నటించిన కళ్యాణ రాముడు, స్టైల్ చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ ఆ తర్వాత అంతగా అవకాశాలు రాలేదు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో కన్నడ బిగ్ బాస్ మొదటి సీజన్ లో సెకండ్ రన్నరప్ టైటిల్ గెలుచుకుంది. చివరగా 2018లో రాజసింహ అనే కన్నడ సినిమాలో నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యింది.

కొన్నాళ్లు సైలెంట్ అయిన నిఖిత.. ముంబైకు చెందిన గగన్ దీప్ సింగ్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి పాప జన్మించింది. 2016లో శ్రీకాంత్ నటించిన టెర్రర్ మూవీలో కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది నిఖిత. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోస్ నెట్టింట వైరలవుతుండగా.. నిఖిత లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.