ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్లలో సాక్షి శివానంద్ ఒకరు. 90’sలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో హిట్ మూవీస్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రాజ శేఖర్ వంటి స్టార్ హీరోలతో జతకట్టింది. 1996లో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగార్జున నటించిన సీతారామారాజు మూవీలో మెరిసింది. తక్కువ సమయంలోనే వరుసగా సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అరవింద్ సామి నటించిన బోధియాల్ అనే తమిళ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మహేష్ బాబు జోడిగా యువరాజు సినిమాలో కనిపించి ఆకట్టుకుంది. ఈ మూవీతో తెలుగులో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది.
అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే సాక్షి ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె కథానాయికగా కనిపించిన చివరి సినిమా సంహరాశి. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ సాక్షికి తెలుగులో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కనిపించింది. 2008లో జగపతి బాబు నటించిన హోమం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్ చేసింది సాక్షఇ. 2010లో శ్రీకాంత్ నటించిన రంగ ది దొంగ సినిమాలో కనిపించిన సాక్షి.. ఆ తర్వాత మరో మూవీలో కనిపించలేదు. పెళ్లి తర్వాత సాక్షి మళ్లీ తెరపై కనిపించలేదు.
చాలా కాలం తర్వాత సాక్షి ఫోటోస్ మళ్లీ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో గుర్తుపట్టలేనంతంగా మారిపోయి కనిపిస్తుంది సాక్షి. దీంతో ఆమె ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
Arojulloo Taperecorders lo, CD shop lo ekada chusina Babu songseyy…!!
Hai Re Hai Debba Oo Yabba…. 😘😊
👉 #SSMBMusicalFestival 🎵💥@urstrulyMahesh #GunturKaaram #YuvaRaju #SakshiShivanand pic.twitter.com/M1iWklY6Uw
— Kadapa Mahesh FC™ (@KadapaMbfc) July 14, 2023
22 Years For @ActorRajasekhar’s #Simharasi !!
Hyderabad, Devi70 42 Days Run. Replaced With #Chirujallu #SakshiShivanand #VSamudra #RBChoudary #SARajKumar @SuperGoodFilms_#22YearsForSimharasi pic.twitter.com/xIHlmCgTV1
— MovieBuzz (@MoviesUpdatez) July 6, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.