Baby Shamili: ఈ క్యూట్ చిన్నారి బేబీ షామిలి గుర్తుందా ?.. ఇప్పుడు ఎంత అందంగా తయారయ్యిందో చూశారా ?..

|

Apr 24, 2023 | 9:29 PM

జగదేక వీరుడు అతిలోక సుందరి, మాయలోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది బేబీ షామిలి. అయితే ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమయ్యింది. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ నటించిన ఓయ్ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది.

Baby Shamili: ఈ క్యూట్ చిన్నారి బేబీ షామిలి గుర్తుందా ?.. ఇప్పుడు ఎంత అందంగా తయారయ్యిందో చూశారా ?..
Baby Shamili
Follow us on

బేబీ షామిలి.. చైల్డ్ ఆర్టిస్ట్‏గా ఎన్నో చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ముద్దు ముద్దు మాటలతో.. అమాయకమైన నటనతో అప్పట్లో సినీ ప్రియులను అలరించేది. 90’sలో వచ్చిన సూపర్ హిట్ చిత్రాల్లో ఈ క్యూట్ చిన్నారి ఉండేది. లోకం పూర్తిగా తెలియని వయసులోనే ఎంతో అభిమానులను సంపాదించుకుంది. అప్పట్లో బేబీ షామిలికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. కేవలం ఆ చిన్నారి నటన కోసం థియేటర్లకు వచ్చే జనాలు ఉండేవారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, మాయలోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ అనేక చిత్రాల్లో నటించింది బేబీ షామిలి. అయితే ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమయ్యింది. చాలా సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ నటించిన ఓయ్ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది.

కానీ చిన్నప్పుడు వచ్చిన గుర్తింపు మాత్రం పెద్దయ్యాక రాలేదు. ఆమె నటించిన ఓయ్ సినిమా పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ షామిలికి మాత్రం అంతగా క్లిక్ కాలేకపోయింది. దీంతో ఆమెకు హీరోయిన్‏గా అవకాశాలు కరువయ్యాయి. చిన్నప్పుడు కనిపించినంత అందంగా లేదంటూ కొందరు ఆమెను ట్రోల్స్ చేశారు. అయితే తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్లను షామిలి అంతగా పట్టించుకోలేదు.

ఇవి కూడా చదవండి

షామిలి 1987 జూలై 10న కేరళలో జన్మించింది. మూడేళ్ల వయసులోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది షామిలి. చైల్డ్ ఆర్టిస్ట్‏గా అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. కథానాయికగా మాత్రం కేవలం ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది షామిలి. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. షామిలికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. త్వరలోనే చెన్నైలో సొంతంగా పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందట. అయితే షామిలి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.