Shivaji Movie: ఏంట్రా బాబూ.. ఇంతందంగా ఉన్నారు.. శివాజీ సినిమాలో కనిపించిన ఈ అక్కా చెల్లెళ్లు గుర్తున్నారా.. ?

ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. తమిళంతోపాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ ఇప్పుడు శంకర్ తెరకెక్కించిన సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు.

Shivaji Movie: ఏంట్రా బాబూ.. ఇంతందంగా ఉన్నారు.. శివాజీ సినిమాలో కనిపించిన ఈ అక్కా చెల్లెళ్లు గుర్తున్నారా.. ?
Shivaji

Updated on: Nov 26, 2025 | 3:33 PM

డైరెక్టర్ శంకర్ రూపొందించిన సినిమాలకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకే ఒక్కడు, అపరిచితుడు, భారతీయుడు, రోబో, శివాజీ, బాయ్స్, ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అప్పట్లో ఈ చిత్రాలన్నీ సౌత్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ఈ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. శంకర్ సినిమా వస్తుందంటే చాలు అడియన్స్ వేయి కళ్లతో ఎదురుచూసేవారు. ఆయన సినిమాల కోసం అటు నిర్మాతలు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ క్యూలో నిల్చునేవారు. కానీ ఇప్పుడు శంకర్ రూపొందించిన సినిమాలకు అంతగా ఆకట్టుకోవడం లేదు. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు శంకర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాల్లో శివాజీ ఒకటి. 2008లో రిలీజ్ అయిన శివాజీ సినిమా ఏ స్థాయిలో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. 45 కోట్లు పెట్టి తీస్తే రూ.60 వేల కలెక్షన్స్ రాలేదు.. నిర్మాతలను నిండా ముంచేసింది..

అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా.. శ్రియా శరణ్ కథానాయికగా కనిపించింది. అలాగే దివంగత హాస్య నటుడు వివేక్ సైతం కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాలో అక్కమ్మ జక్కమ్మ అంటూ కనిపించిన ఇద్దరు కవలలు గుర్తున్నారా.. ?ఈ సినిమాలో వీరిద్దరు కనిపించే సీన్స్ జనాలను తెగ నవ్వించాయి. అక్కమ్మ జెక్కమ్మలను ఇందులో ఢీగ్లామర్ గా చూపించారు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం వాళ్లిద్దరూ ఎంతో అందంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  Prithviraj Sukumaran : ఏంటీ.. ఈ స్టార్ హీరో భార్య టాప్ జర్నలిస్టా.. ? ఫోన్ కాల్‏తో ప్రేమకథ.. లవ్ స్టోరీలో సినిమాను మించిన ట్విస్టులు..

అక్కమ్మ, జక్కమ్మల అసలు పేర్లు సుజాత బాబ, దివ్య. ఇద్దరూ నిజ జీవితంలోనూ అక్కా చెల్లెళ్లు. శివాజీ సినిమాలో డీగ్లామర్ గా కనిపించిన ఈ ఇద్దరికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. రియల్ లైఫ్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి పోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : కుర్రాళ్లకు మెంటలెక్కించిన హీరోయిన్.. కట్ చేస్తే.. అవకాశాల కోసం ఎదురుచూపులు..

Akkamma Jakkamma

ఇవి కూడా చదవండి : Nani : నానితో జెర్సీ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చివరకు ఆ హీరోతో బ్లాక్ బస్టర్..