Tollywood: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు కాలిఫోర్నియాలో స్కూల్ టీచర్ గా.. ఎవరంటే?

ఈ హీరోయిన్ ఎంట్రీనే సంచలనం.. 19 ఏళ్ల వయసులోనే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కేవలం నాలుగేళ్ల గ్యాప్ లోనే 15 సినిమాలు చేసింది. అయితే ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి మాయమైపోయింది.. కట్ చేస్తే ఇప్పుడు కాలిఫోర్నియాలో..

Tollywood: ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు కాలిఫోర్నియాలో స్కూల్ టీచర్ గా.. ఎవరంటే?
Actress Renuka Menon

Updated on: Jan 16, 2026 | 10:52 AM

హీరోలతో పోలిస్తే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకటి లేదా రెండు ఫ్లాపులు పడితే చాలు సినిమా అవకాశాలు కనుమరుగవుతాయి. అలాగే పెళ్లి చేసుకున్న హీరోయిన్లకు కూడా సినిమా ఛాన్సులు తగ్గుతాయి. అందుకే చాలా మంది ముద్దుగుమ్మలు ఉన్నట్లుండి సినిమా ఇండస్ట్రీ నుంచి మాయమైపోతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ హీరోయిన్ 2002లో ఒక మలయాళం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సరిగ్గా క్రిస్మస్ రోజున విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ఇక సినిమాలో హీరోయిన్ అందానికి, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. క్రిటిక్స్‌ సైతం ప్రశంసలు కురిపించారు. అప్పటికీ ఆమె వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే. దీని తర్వాత ఈ ముద్దుగుమ్మ రేంజ్ మారిపోయింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. అలా కేవలం 4 ఏళ్లలోనే 15 సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే చాలామంది లాగే ఒకానొకదశలో ఈ ముద్దుగుమ్మకు కూడా ఒకటి రెండు ఫ్లాపులు పడ్డాయి. ఫలితంగా సినిమా ఛాన్సులు కరువయ్యాయి. దీంతో ఈ అందాల తార యాక్టింగ్‌కి గుడ్‌బై చెప్పేసింది. సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కట్ చేస్తే ఇప్పుడీ హీరోయిన్ కాలిఫోర్నియాలో స్థిరపడింది. భర్త, పిల్లలతో కలిసి అక్కడే నివాసముంటోంది. ఓ డ్యాన్స్ స్కూల్ ను నిర్వహిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా?

మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన రేణుకా మేనన్ పలు తెలుగు సినిమాల్లోనూ యాక్ట్ చేసింది. ఆనందం ఫేమ్ ఆకాశ్ తో కలిసి ఆనందమానందమాయే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2004లో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. దీని తర్వాత పలు తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ సినిమాల్లోనూ యాక్ట్ చేసిందీ అందాల తార. అయితే 2006 తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది రేణుక. అదే సంవత్సరంలో ఐటీ ఫ్రొఫెషనల్ అయిన సూరజ్‌కుమార్‌ నంబియార్‌ని పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ.

రేణుకా మేనన్ లేటెస్ట్ ఫొటోస్..

ఆ తర్వాత భర్తతో కలిసి కాలిఫోర్నియా వెళ్లి అక్కడేసెటిలైపోయింది. ఇప్పుడు ఈ జంటకు ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉంటోన్న రేణుక ఇప్పుడు కాలిఫోర్నియాలోనే ఒక డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తోంది. క్లాసికల్ డ్యాన్స్ అండ్ వెస్ట్రన్ డ్యాన్స్ లోనూ స్టూడెంట్స్ కు శిక్షణ ఇస్తోంది.

భర్త, పిల్లలతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.