ఏంటీ..! ఈ విలన్ చెల్లెల్లు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్సా..! ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలుగా, హీరోయిన్స్ , విలన్ గా చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో విలన్ గా చేసి ఆకట్టుకున్నాడు. ఆయన చెల్లెల్లు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా రాణించారు. ఆహీరోయిన్స్ ఎవరో తెలుసా.?

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా మారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడున్న చాలా మంది హీరోలు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి మెప్పించారు. అలాగే కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా, విలన్స్ గాను మారిపోతూ ఉంటారు. అలాగే పైన కనిపిస్తున్న విలన్ గుర్తున్నాడా.? అతను కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అతని పేరు రిచర్డ్ రిషీ.. ఈపేరు చెప్తే అంతగా గుర్తుపట్టకపోవచ్చు కానీ ఫోటో చూస్తే గుర్తుపట్టేస్తారు.ఈ విలన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించాడు. మెగాస్టార్ చిరంజీవి కల్ట్ క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.
ఆతర్వాత విలన్ గా మారి ప్రేక్షకులను మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన రిషీ.. ఆతర్వాత విలన్ గా తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు చేశాడు. ‘A Film By అరవింద్ సినిమాతో రిషీకి మంచి గుర్తింపు వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా సినిమాలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈయన చెల్లెల్లు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.? రిషీ సిస్టర్స్ గురించి తెలిస్తే షాక్ అవుతారు.
విలన్ గా రాణిస్తున్న రిషీ సిస్టర్ ఎవరో కాదు.. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన షామిలీ, షాలినీ. వీరిలో షాలిని చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 8 సినిమాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేదు. ఆమె స్టార్ హీరో అజిత్ వైఫ్. అలాగే షాలిని చెల్లి షామిలి తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సిద్దార్థ్ హీరోగా నటించిన ‘ఓయ్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది షామిలి. ప్రస్తుత ఈ ఇద్దరూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




