
సోషల్ మీడియలోనిత్యం వైరల్ అవుతోన్న ఫొటోల్లో ఎక్కువగా కనిపించేవి సెలబ్రెటీల చిన్ననాటి ఫొటోలే.. సినిమా తరాలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెట్టింట ప్రతిరోజు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. పైన కనిపిస్తోన్న ఫోటో చూశారా.. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఓ క్రేజీ హీరోయిన్ ఉంది ఎవరో గుర్తుపట్టారా.. స్కూల్ డ్రస్ లో ఫ్రెండ్ తో కలిసి సరదాగా దిగిన ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ కు మంచి క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తుపట్టడం అంత కష్టమేమి కాదు గురూ.. ఇంతకు ఆ ఫొటోలో ఉన్న బ్యూటీ ఎవరెంటే..
ఒకానొక సమయంలో కుర్రకారు మనసులను దోచేసిన బ్యూటీ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు మీరా జాస్మిన్. తమిళ్ , తెలుగు భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది. ముఖ్యంగా తెలుగులో భద్ర, గుడుంబా శంకర్‌లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సినిమాల్లో నటించే సమయంలో స్కిన్ షో కు నో చెప్పిన ఈ భామ. ఇప్పుడు మాత్రం ఓ రేంజ్ లో అందాలు విందు వడ్డిస్తూ హాట్ టాపిక్ గా మారింది. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. కుర్రహీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోకుండా అందాలు ఒలకబోస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.