AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: YVS చౌదరి భార్య ఒకప్పుడు హీరోయిన్.. ఏ సినిమాల్లో నటించిందంటే..?

సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు దర్శకుడు వైవీఎస్ చౌదరి. ఇంతకీ ఆమె ఎవరూ? ఏ సినిమాల్లో నటించింది? పెళ్లికి పెద్దలు ఓకే చెప్పారా..? ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Tollywood: YVS చౌదరి భార్య ఒకప్పుడు హీరోయిన్.. ఏ సినిమాల్లో నటించిందంటే..?
YVS Chowdary
Ram Naramaneni
|

Updated on: Jun 10, 2024 | 8:22 PM

Share

తెలుగులో మెమరబుల్ చిత్రాలను అందించిన దర్శకుడు వైవీఎస్ చౌదరి. ఒకప్పుడు మంచి క్లాసిక్ సినిమాలను అందించిన ఈ డైరక్టర్.. ఆ తర్వాత అపజయాలు పలకరించడంతో కొంత బ్రేక్ తీసుకున్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో వైవీఎస్ చౌదరి చాలా బిగ్ పర్సనాలిటీ. కింది స్థాయి నుంచి వచ్చి.. తెలుగు ఇండస్ట్రీలో రచయితగా, దర్శకుడిగా, ఎగ్జిబిటర్‌గా, ఆడియో కంపెనీ అధినేతగా సత్తా చాటారు. సీనియర్ ఎన్టీఆర్‌పై విపరీతమైన అభిమానం పెంచుకున్న వైవీఎస్ చౌదరి.. సినిమాల్లోనే ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీ బాట పట్టారు. పలు సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసిన తర్వాత..  1998 లో హీరో నాగార్జున నిర్మాణంలో  ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ’ చిత్రం ద్వారా డైరెక్టర్ అయ్యారు. ఆ సినిమాకు మంచి అప్లాజ్ రావడంతో.. వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేసిన సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ, ఆయన కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు అభిమానుల ప్రేమను చూరగొన్నాయి. ఒక 40 ఏళ్లు పైబడిన హీరోని, నందమూరి కుటుంబం తాలూకా లెగసీని..ఒక లైన్ పై నిలబెట్టి ఆయన అందించిన బ్లాక్ బస్టర్స్ వండర్స్ లాగా అనిపిస్తాయి.

అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని వైవీఎస్ చౌదరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని మీకు తెల్సా..?.  వైవీఎస్ చౌదరి సతీమణి పేరు గీత. ఆమె నాగార్జున నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘నిన్నే పెళ్లాడుతా’లో హీరో చెల్లెలుగా నటించారు. ఆ తర్వాత మాస్ మహరాజ నటించిన సింధూరం చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా సందడి చేశారు. ఆ తర్వాత పలు సినిమాల్లో మంచి పాత్రలే చేశారు. నిన్నే పెళ్లాడుతా మూవీ సమయంలో వైవీఎస్ చౌదరి దర్శకత్వ శాఖలో పనిచేసేవారు.. ఆ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహం, ఆపై ప్రేమగా మారింది.. ఇద్దరి కులాలు వేరు అవ్వడంతో పెద్దలు అభ్యంతరం చెప్పినా.. వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కాగా దాదాపు పదేళ్ల విరామం తర్వాత దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు వైవీఎస్ చౌదరి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
పాలు - అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు..
పాలు - అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు..
మందుబాబులకు క్యాబ్ ఫ్రీ.. కాల్ చేస్తే క్షణాల్లోనే సర్వీసులు
మందుబాబులకు క్యాబ్ ఫ్రీ.. కాల్ చేస్తే క్షణాల్లోనే సర్వీసులు
జమ్ముకశ్మీర్‌లో న్యూ ఇయర్‌ వేడుకల వేళ హైఅలర్ట్‌..
జమ్ముకశ్మీర్‌లో న్యూ ఇయర్‌ వేడుకల వేళ హైఅలర్ట్‌..