
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేమ వ్యవహారాలు, పెళ్లి సంగతులు నిత్యం వార్తల్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఒకరు, ఇద్దరితో రిలేషన్ షిప్ ను నడిపిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నవారు ఉన్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా రెండు సార్లు లేచిపోయి పెళ్లి చేసుకుంది. చివరకు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆమె ఎవరో తెలుసా.? ఆ చిన్నది ఓ స్టార్ హీరోయిన్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ పీక్ లో ఉండంగానే ఈ భామ స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుంది. అతనితో లేచిపోయి పెళ్లి చేసుకుంది.. ఆతర్వాత విడాకులు తీసుకొని మరొకరితో ప్రేమలో పడింది.. అతనితోనూ పారిపోయి పెళ్లి చేసుకుంది. ఆమె ఎవరంటే..
బిందియా గోస్వామి.. ఈ స్టార్ హీరోయిన్.. 1970 మరియు 1980 దశకాలలో హిందీ సినిమాల్లో ప్రముఖ నటిగా గుర్తింపు పొందింది. ఈ స్టార్ హీరోయిన్ వ్యక్తిగత జీవితం ఆమె సినీ కెరీర్ కంటే ఎక్కువగా చర్చనీయాంశమైంది. బిందియా గోస్వామి జనవరి 6, 1962న రాజస్థాన్‌లోని కామన్, భరత్‌పూర్‌లో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ రెండు సార్లు పెళ్లి చేసుకుంది. బిందియా 18 సంవత్సరాల వయస్సులో, 1980లో తన తరచూ సహనటుడైన వినోద్ మెహ్రాను పారిపోయి వివాహం చేసుకుంది. వినోద్ అప్పటికే మీనా బ్రోకాతో వివాహం జరిగింది.. ఆతర్వాత ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ వివాహం గురించి మీడియాలో వచ్చిన ప్రచారం బిందియా కెరీర్‌ను దెబ్బతీసింది.
1985లో, బిందియా దర్శకుడు జె.పి. దత్తాతో ప్రేమలో పడి, అతనితో కూడా లేచిపోయి వివాహం చేసుకుంది. జె.పి. దత్తా ఆమె కంటే 12-13 సంవత్సరాలు పెద్దవాడు. వారి కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని, వారు రహస్యంగా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వారికి నిధి, సిద్ధి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో పెళ్లి తర్వాత బిందియా గోస్వామి సినిమాలకు దూరం అయ్యింది. రెండు సార్లు లేచిపోయి వివాహం చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. బిందియా గోస్వామి మాత్రమే కాదు ఆమె తండ్రి ఏకంగా ఏడుసార్లు పెళ్లి చేసుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.