90 సినిమాలు 10 భాషలు..! నలుగురితో లవ్ ఎఫైర్స్..!! కట్ చేస్తే 50ఏళ్లలో సింగిల్‌గా..

చాలా మంది హీరోయిన్స్ పెళ్లి అనే టాపిక్ లేకుండా సింగిల్ గానే ఉంటున్నారు. ఐదు పదుల వయసులోనూ సింగిల్ గా ఉంటున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు.. తెలుగులో ఆమె తోప్ హీరోయిన్.. దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

90 సినిమాలు 10 భాషలు..! నలుగురితో లవ్ ఎఫైర్స్..!! కట్ చేస్తే 50ఏళ్లలో సింగిల్‌గా..
Tollywood Actress

Updated on: Dec 07, 2025 | 12:50 PM

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక హీరోలు, హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంరెస్టింగ్ చూపిస్తున్నారు. హీరోయిన్స్ కూడా నాలుగైదు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పాన్ ఇండియా సినిమాల హావ లేనప్పుడే హీరోయిన్స్ కొందరు ఇతరభాషల్లో సినిమాలు చేసి పేక్షకులను ఆకట్టుకున్నారు. వారిలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ ఒకరు. 10 భాషల్లో 90 సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు రాణించింది. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

స్టార్ హీరోయిన్ నగ్మా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన అందంతో 90వ దశకంలో యువతను కట్టిపడేసింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్‌పురి, పంజాబీ, బెంగాలీ, మరాఠి భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అదే సమయంలో ప్రేమ వ్యవహారాలతోనూ వార్తల్లో నిలిచింది. నటుడు శరత్‌ కుమార్‌, మనోజ్‌ తివారి, రవి కిషన్‌లతో పాటు క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీతోనూ లవ్‌లో పడిందని ప్రచారం సాగింది.

ఇది కూడా చదవండి : నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్.. అదేంటంటే

అయితే ఏ ఒక్కరితోనూ ఆమె ప్రేమ బంధం నిలబడలేకపోయిందని రూమర్లు వచ్చాయి. అయితే వీటితో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ అందాల తార ఇప్పటికీ సింగిల్ గానే ఉంటోంది. 10 భాషల్లో 90 సినిమాలు చేసింది.. 50ఏళ్ల వయసులోనూ ఆమె తన అందంతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఆన్న నగ్మా సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలోనూ నగ్మా యాక్టివ్ గా ఉంటుంది.. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో.. చాలా బాధపడ్డానన్న నేచురల్ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.