ఎన్టీఆర్, మహేష్, పవన్‌లతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ ఇటీవలే వార్ 2తో ఆడియన్స్ ముందుకు వచ్చారు.

ఎన్టీఆర్, మహేష్, పవన్‌లతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న హీరోయిన్.. ఇప్పుడు ఏం చేస్తుందంటే
Mahesh Babu, Pawan Kalyan, NTR

Updated on: Aug 27, 2025 | 12:36 PM

తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోల్లో ముందువరసలో ఉంటారు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్. ఈ ముగ్గురు హీరోలకు ఉన్న క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముగ్గురు హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. మహేష్, పవన్, ఎన్టీఆర్ ముగ్గురు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. అయితే ఈ ముగ్గురు హీరోలు చేసిన ఇండస్ట్రీ హిట్స్ లో నటించింది ఒకే హీరోయిన్ ఆమె ఎవరో తెలుసా.? ఆమె ఎంతో మంది అభిమాన హీరోయిన్. ఆమెతో సినిమాలు చేయడానికి హీరోలు క్యూ కట్టేవారు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

ఆయనకు 36.. ఆమెకు19.. కట్ చేస్తే 20ఏళ్లకే తల్లయ్యింది.. చేతులారా కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్

ఇంతకూ ఆమె ఎవరో కాదు భూమిక చావ్లా.. వయసు పెరిగినా తరగని అందంతో ఆకట్టుకుంటున్న భామల్లో భూమిక చావ్లా ఒకరు. తెలుగు తమిళ్ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అందాల భామ. తెలుగులో ఈ అమ్మడి క్రేజ్ నెక్ట్స్  లెవల్లో ఉండేది. సుమంత్ హీరోగా నటించిన యువకుడు అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ వయ్యారి భామ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. అలాగే మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంది ఈ భామ.

ఇవి కూడా చదవండి

డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకోవాలనుకుంది.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తోప్.. చేతినిండా సినిమాలు

ఇక తెలుగులో ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. దాంతో ఈ భామ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్ తో ఖుషీ, మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్‌తో సింహాద్రి సినిమాలతో భారీ విజయాలను అందుకుంది. ఈ మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. అలాగే సీనియర్ హీరోలతోనూ నటించి ఆకట్టుకుంది ఈ భామ. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రల్లో నటిస్తోంది.

ఇదెక్కడి మాస్ రా మావ..! రామ్ చరణ్ పెద్దిలో ఫిల్మీ మోజీ.. థియేటర్స్ దుమ్ములేచిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి