తల పగిలి కుట్లు పడ్డాయి.. అయినా షూటింగ్ ఆపలేదు..! కట్ చేస్తే భారీ హిట్.. ఈ హీరో ఎవరో తెలుసా..?

సినిమా షూటింగ్ ఎంతో కష్టంతో కూడుకున్న పని.. సినిమా సెట్ లో చాలా మంది నటీనటులు షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు గాయపడ్డరు. హీరో విశాల్ ఎన్నో సార్లు షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. అంతే కాదు మన హీరోలు రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, బాలకృష్ణ లాంటి హీరోలు కూడా షూటింగ్స్ లో గాయపడ్డరు.

తల పగిలి కుట్లు పడ్డాయి.. అయినా షూటింగ్ ఆపలేదు..! కట్ చేస్తే భారీ హిట్.. ఈ హీరో ఎవరో తెలుసా..?
Hero

Updated on: May 04, 2025 | 4:54 PM

సినిమా షూటింగ్స్ లో అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది సినీ సెలబ్రెటీలు షూటింగ్ సమయంలో గాయపడుతూ ఉంటారు. ఒకప్పుడు సినిమా షూటింగ్ లో యాక్షన్స్ సీన్స్ కోసం డూప్స్ ను వాడేవారు. ఇప్పుడు హీరోలు మాత్రం యాక్షన్స్ సీన్స్ కోసం చాలా కష్టపడుతున్నారు. రిస్క్ సీన్స్ కూడా చేయడానికి వెనకాడకుండా షూటింగ్స్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు షూటింగ్స్ లో గాయపడ్డారు. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బాలకృష్ణ  ఇలా చాలా మంది షూటింగ్స్ లో గాయపడుతున్నారు. తాజాగా ఓ హీరో కూడా షూటింగ్ లో గాయపడ్డాడు. షూటింగ్ లో ఏకంగా తలకు బలమైన గాయం అయ్యింది. తలకు గాయం అవ్వడంతో ఏకంగా కుట్లు కూడా పడ్డాయి. ఇంతకూ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్.. ఆమె ఎవరంటే

రీసెంట్ గా భారీ హిట్ అందుకున్నాడు. అలాగే వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని.  నాని ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. దసరా సినిమాతో మొదలు పెడితే హాయ్ నాన్న, సరిపోదా శనివారం, రీసెంట్ గా హిట్ 3 సినిమాతో బ్లాక్ బాస్టర్స్ అందుకున్నాడు. తాజాగా శైలేష్ దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 సినిమాతో భారీ హిట్ తో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది.

ఇది కూడా చదవండి :థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఆ అమ్మడి స్పెషల్ సాంగ్..

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. మాస్ అవతార్ లో నాని అదరగొట్టాడు. ఈ సినిమా షూటింగ్ లో నాని గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దర్శకుడు శైలేష్ సోషల్ మీడియాలో హిట్ 3 సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోలు షేర్ చేశాడు. సినిమాలో కొన్ని అల్లరి మూకలను నాని తిరుమే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో నాని తలకు గాయం అయ్యిందని తెలిపాడు. అలాగే నాని ఒంటికి నిప్పు కూడా అంటుకుందని తెలిపాడు శైలేష్. తలకు దెబ్బ తగిలినా కూడా కుట్లు పడినా కూడా వెంటనే నాని షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.. అది ఆయన డెడికేషన్ అంటూ దర్శకుడు శైలేష్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి