AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను ముస్లిం అమ్మాయి అని ఎవరికి తెలియదు.. ఆసక్తికర విషయం చెప్పిన సీరియల్ బ్యూటీ

చాలా మంది సీరియల్ హీరోయిన్స్.. సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. చాలా మంది సీరియల్ భామలు సోషల్ మీడియాలో తమ అందాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నది సీరియల్స్ లో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

నేను ముస్లిం అమ్మాయి అని ఎవరికి తెలియదు.. ఆసక్తికర విషయం చెప్పిన సీరియల్ బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: May 04, 2025 | 5:30 PM

Share

తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన షోల్లో బిగ్ బాస్ షో ఒకటి. చాలా భాషల్లో ఆకట్టుకున్న బిగ్ బాస్ షో తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ షో ఏడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే ఓక ఓటీటీ సీజన్ కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ ద్వారా చాలా మంది మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే చాలా మంది సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే కొంతమంది బిగ్ బాస్ తర్వాత కనిపించకుండా పోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఆ అమ్మడు అలా కాదు. ఈ బ్యూటీ సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పెద్ద కష్టమేమి కాదు ఆమెను గుర్తుపట్టడం.

బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి మరింత దగ్గరైంది హమీదా..ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ సీరియల్ లో ఆమె పాత్ర మొదట్లో నెగిటివ్ రోల్ లో ఉన్నప్పటికీ ఆతర్వాత ఆమె పాత్రను పాజిటివ్ యాంగిల్ లోకి మార్చారు. ఈ క్యారెక్టర్ తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఆ సీరియల్ ఆమె పాత్ర నుంచి తప్పించారు. ఇప్పుడు ఓ ఓటీటీలో డాన్స్ షోలో మెంటర్ గా చేస్తుంది హమీద. సీరియల్స్ లో చాలా పద్దతిగా చీర కట్టులో కనిపించే ఈ బ్యూటీ బయట మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుంది. సీరియల్స్ ను ఫాలో అయ్యేవారికి ఈ అమ్మడిని పద్దతిగా చూస్తే ఉంటారు. కానీ సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ మాత్రం మాములుగా ఉండదు.

తాజాగా హమీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హమీద మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ తో పాపులర్ అయిన శివ యాంకర్ గా చేసిన ఇంటర్వ్యూలో హామీదను.. నువ్వు చర్చ్ కి వెళ్తావు, మసీదుకు వెళ్తావు, గుడికి వెళ్తావు స్పెషల్ ఏంటి.? అని అడిగాడు. దానికి హమీద సమాధానమిస్తూ.. నేను చిన్నప్పటి నుంచి చదివిని స్కూల్ సపరేట్ ముస్లిమ్ స్కూల్ కాదు.. మా స్కూల్ లో పూజ , సరస్వతీ పూజ ఉండేది. సరస్వతి పూజ ఒకటి, దుర్గా పూజ ఒకటి. కాళీమాత పూజ నా ఫ్రెండ్స్ తో తిరగడం వల్ల అలవాటు అయ్యింది. అప్పుడు నేను కలకత్తాలో ఉండేదాన్ని.. అక్కడ హిందూ, ముస్లిం డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు నేను ముస్లిం అమ్మాయి అని ఎవరికి తెలియదు. గూగుల్‌లోనే నా రిలీజియన్ హిందూ అని ఉంటుంది. కాబట్టి తనకు ఆ డిఫరెన్స్ లేదని చెప్పుకొచ్చింది హమీద ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన చికెన్‌ ధరలు.. కేజీ ఎంతంటే..!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
వీడి క్రియేటివిటీ చూసి ఇంజనీర్లు కూడా స్టన్.!
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
జపనీస్ స్కూల్ ఆడపిల్లల స్కర్టులు అంత పొట్టిగా ఎందుకుంటాయ్? కారణం
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
అతను పోలీసే కాదు.. డ్రెస్ వేసుకుని దర్జాగా లోపలికి వెళ్లాడు..
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
బ్రౌన్ షుగర్ తింటే బరువు తగ్గుతారా? వైట్ షుగర్‌తో లాభమేంటి?
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
చికెన్ మాంసంలోని ఈ 10 భాగాలను అస్సలూ ముట్టొద్దు.. పొరపాటు జరిగింద
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
'హనుమాన్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భర్త వద్దు.. ప్రియుడే కావాలి.. వివాహిత మంకుపట్టు.. !
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
భయం అది పుట్టించింది ఎవరు మేము.. కంబ్యాక్ ఇంకా గట్టిగా ఇస్తాం
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?
ఏసీలో కూర్చొంటే హైబీపీ వస్తుందా? డాక్టర్లు ఏమన్నారో తెలుసా?