
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు పెద్ది అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చరణ్. బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం చరణ్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ, కబడ్డీ వంటి వివిధ ఆటలు ఉంటాయని. రామ్ చరణ్ ఒక ‘ఆట కూలీ’ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా నుంచి చికిరి చికిరి. అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈసాంగ్ లో చరణ్ డాన్స్ తో అదరగోట్టారు. అలాగే జాన్వీ తన అందాలతో కవ్వించింది.
పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి సాంగ్ ఇప్పటికే నయా రికార్డ్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ సాంగ్..ఇదిలా ఉంటే చికిరి చికిరి.. సాంగ్ లో కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చికిరి చికిరి పాటలో జాన్వీ పక్కన ఫ్రెండ్ రోల్ లో కనిపించిన ఈ చిన్నదనికి కోసం నెటిజన్స్ గాలిస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఆమె పేరు శ్వేతా సలురు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.