మహేష్, పవన్ సినిమాలకు నో చెప్పిన స్టార్ నటుడు.. బ్రతికినంత కాలం హీరోగానే

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ తోప్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ముఖ్యంగా లేడీస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఆ స్టార్ హీరో. కానీ ఆయన బ్రతికినంత కాలం హీరోగానే ఉన్నారు.

మహేష్, పవన్ సినిమాలకు నో చెప్పిన స్టార్ నటుడు.. బ్రతికినంత కాలం హీరోగానే
Tollywood Hero

Updated on: Mar 26, 2026 | 12:50 PM

తెలుగు సినిమా చరిత్రలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటుడు ఆయన. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కట్టేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆ స్టార్ హీరోల సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. అంతే కాదు లేడీస్ లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఎవర్ గ్రీన్ సినిమాలు చేసి తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేశారు. అయితే హీరోగా రాణించిన ఆయన సహాయక పాత్రల్లో చేయడానికి మాత్రం వెనకడుగు వేశారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా నో చెప్పారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబు. హీరో శోభన్ బాబు అసలు పేరు ఉప్పు శోభనాచలపతిరావు. 1937, జనవరి 14న కృష్ణా జిల్లా, చిన్న నందిగామలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన శోభన్ బాబు గారు, సినిమాల పట్ల, నాటకాల పట్ల చిన్నప్పటి నుంచే మంచి ఆసక్తిని పెంచుకున్నారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నారు.

మనిషి చాలా మంచోడే కానీ అది ఒక్కటే చెడ్డ అలవాటు.. స్టార్ నటుడి గురించి శివాజీ రాజా

ఆయనకు తెలుగు ప్రజల్లో సోగ్గాడుగా అపారమైన ఇమేజ్ ఉంది. ఎవరైనా అందంగా తయారైతే, “ఏంట్రా శోభన్ బాబులా తయారయ్యావు” అని అనడం ఆ రోజుల్లో పరిపాటి. అంతటి అందగాడు, అద్భుతమైన నటుడు ఆయన. శోభన్ బాబు గారు తన కెరీర్ లో కేవలం హీరో పాత్రలనే పోషించారు. కొత్త తరం హీరోలు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న సమయంలో, ఆయన నెమ్మదిగా హీరోగా నటించడం మానేసి, సినిమా రంగానికి పూర్తిగా గుడ్ బై చెప్పారు. ఆ రోజు నుంచి మళ్లీ సినిమా రంగం వైపు తిరిగి చూడలేదు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏ సినిమాలోనూ నటించకపోవడానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. ప్రజల గుండెల్లో తాను ఎప్పుడూ హీరోగానే ఉండాలని, తన హీరో ఇమేజ్‌ను ఏ మాత్రం తగ్గించుకోకూడదని ఆయన గట్టిగా నమ్మారు. ఈ సిద్ధాంతానికి కట్టుబడే అనేక ఆఫర్లను తిరస్కరించారు.

OTT Movie: ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా..! ట్విస్ట్‌లతో పిచ్చెక్కిపోద్ది..

మహేష్ బాబు, త్రిష జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు చిత్రానికి నో చెప్పారట. ఈ సినిమా నిర్మాత మురళీమోహన్ గారు, శోభన్ బాబు గారితో ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు. ఆ పరిచయం మీద ఆయన అతడు చిత్రంలో నాజర్ పోషించిన పాత్రను చేయమని శోభన్ బాబు గారిని కోరారట. అయితే, శోభన్ బాబు గారు ఆ ఆఫర్‌ను తిరస్కరించారట. అదే విధంగా, పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం చిత్రంలో రఘువరన్ పోషించిన పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రకు భీమనేని శ్రీనివాసరావు శోభన్ బాబు గారిని సంప్రదించారట. ఈ ఆఫర్ ను కూడా ఆయన నో అని చెప్పి పంపించేశారట. చాలా మంది నిర్మాతలు బ్లాంక్ చెక్కులు ఇచ్చి మరీ ఆయనను క్యారెక్టర్ రోల్స్ చేయమని కోరారట. కానీ, శోభన్ బాబు గారు తన నిర్ణయం మార్చుకోలేదట.

ఇవి కూడా చదవండి

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us