Ravi Teja: రవితేజకు అక్కగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్వయం కృషితో పైకి వచ్చారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మాస్ మహారాజ రవితేజ ఒకరు. ఒకప్పుడు విలన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు ఇండస్ట్రీలో తోప్ హీరోగా రాణిస్తున్నాడు.

Ravi Teja: రవితేజకు అక్కగా నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు
Raviteja

Updated on: May 20, 2025 | 11:42 AM

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు మాస్ మహారాజ రవితేజ. వరుసగా సినిమాలు చేస్తున్నా.. కూడా సాలిడ్ హిట్ అందుకోవడానికి కష్టపడుతున్నాడు. ఒక్క సినిమా హిట్ పడితే .. నాలుగు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో రవితేజ భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే రవితేజకు అక్కగా నటించిన స్టార్ హీరోయిన్ గురించి తెలుసా.? ఆమె మాములు హీరోయిన్ కాదు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఆమె ఇప్పుడు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి బడా హీరోలతో ఆమె నటించి మెప్పించింది.

రవితేజ కెరీర్ బిగినింగ్ లో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.అంతే కాదు రవితేజ విలన్ గాను చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడుతా సినిమాలో చిన్న విలన్ రోల్ లో కనిపించాడు. అలాగే జగపతిబాబు హీరోగా నటించిన బడ్జెట్ పద్మనాభం సినిమాలో సహాయక పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ తమ్ముడిగా కనిపించారు రవితేజ. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

రవితేజ ఆతర్వాత సింధూరం సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ అందుకున్నాడు రవితేజ.. సిందూరం, ఖడ్గం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, భద్ర, నా ఆటోగ్రాఫ్, విక్రమార్కుడు, వెంకీ, దుబాయ్ శ్రీను, మిరపకాయ్, కిక్ , ధమకా, వాల్తేరు వీరయ్య ఇలా ఎన్నో హిట్స్ అందుకున్నాడు రవితేజ.. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.