
స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కుబేర. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగార్జున , రష్మిక కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఊహించని విధంగా విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ నటన పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల మేకింగ్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగార్జున తొలిసారి డిఫరెంట్ రోల్ లో కనిపించి మెప్పించారు. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ దేవీ ఇరగదీశాడు.
ఇక ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో అమ్మ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. నా కొడుకా అంటూ సాగే ఈ సాంగ్ ను నందకిషోర్ రాశారు. అద్బుతంగా ట్యూన్.. మనసుకు హత్తుకునే లిరిక్స్ తో ఈ సాంగ్ సాగుతుంది. ఇక ఈ సాంగ్ పాడింది ఎవరో కాదు పేరు సిందూరి విశాల్.. తన గొంతుతో ఈ పాటకు ప్రాణం పోసింది సిందూరి. ఈ సాంగ్ తర్వాత చాలా మంది ఈ సింగర్ గురించి గూగుల్ ను గాలిస్తున్నారు.
సిందూరీ విశాల్ ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించారు. ఈ సాంగ్ తో ఆమె క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక కుబేర సినిమా విషయానికొస్తే.. శేఖర్ కమ్ముల సినిమాల్లో బెస్ట్ మూవీ ఇదే అని ఆయనే స్వయంగా చెప్పారు. సినిమా రిలీజ్ తర్వాత సినీ ప్రముఖులు కూడా ఈ మూవీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా కాలాంతర్వత కుబేర సినిమాకు థియేట్సర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి