Megastar Chiranjeevi: చిరంజీవి చెప్పిన ఒక్క మాటతో 400 సినిమాల్లో నటించిన కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఒక్కమాటతో తాను 400 సినిమాల్లో నటించానని ఓ తెలుగు కమెడియన్ అన్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని..ఆయన ప్రశంసే తనను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హాస్యనటుడు ఎవరు.. ? ఇంతకీ చిరు చెప్పిన మాట ఏంటో తెలుసుకుందామా.

Megastar Chiranjeevi: చిరంజీవి చెప్పిన ఒక్క మాటతో 400 సినిమాల్లో నటించిన కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Raghubabu

Updated on: May 07, 2025 | 2:09 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి టాప్ హీరోగా మారారు. చిరును స్పూర్తిగా తీసుకుని సినీరంగంలోకి అడుగుపెట్టిన తారలు చాలా మంది ఉన్నారు. అలాగే ఎంతో మంది యంగ్ నటీనటులకు తన మాటలతో ఆత్మవిశ్వాసం కలిగించారు చిరు. అయితే చిరు చెప్పిన ఒక్క ప్రశంసతో తాను దాదాపు 400 సినిమాల్లో నటించానని అన్నారు ఓ టాప్ కమెడియన్. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? అతడు మరెవరో కాదు.. రఘుబాబు. విలన్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు ఆ తర్వాత హాస్యనటుడిగా మారాడు. హాస్య విలన్‌గా అద్భుతమైన సినిమాలు తీసిన రఘుబాబు, బ్రహ్మానందం లాగానే తన పంచ్ డైలాగ్స్, ఎక్స్ ప్రెషన్స్ తో కడుపుబ్బా నవ్వించాడు. ఆది సినిమాలో పవర్ ఫుల్ విలన్.. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన బన్నీ చిత్రంలో విలన్ పాత్రలోనే నవ్వించాడు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో రఘుబాబుపై ప్రశంసలు కురిపించారు చిరంజీవి. బన్నీ చిత్రం రఘుబాబు నటన అద్భుతంగా ఉంది.. ఆయన కోసమే ఈ చిత్రాన్ని పదిసార్లు చూసిన అడియన్స్ ఉన్నారు. కానీ మూవీ ఈవెంట్ లో అతడి గురించి ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. కానీ కేవలం చిరంజీవి మాత్రమే రఘుబాబు యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారట.

రఘుబాబు కామెడీ కోసమే తాను బన్నీ సినిమాను చాలాసార్లు చూశానని.. అందులో తన యాక్టింగ్ అద్భుతంగా ఉందని అన్నారు చిరు. ఆ ప్రశంసతోనే తాను ఇప్పటివరకు 400 సినిమాల్లో నటించానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రఘుబాబు.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..