బాబోయ్..! ఈ స్టార్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ..! గుండుతో ఉన్న ఈ టాలీవుడ్ నటిని గుర్తుపట్టారా.? .

చాలా మంది హీరోయిన్స్ ఎన్నో ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పాత్ర ఏదైనా సరే వెనకాడకుండా నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక సినిమాల కోసం ఎలాంటి గెటప్ వేసుకోవడానికైన రెడీ అవుతున్నారు. కొంతమంది రియల్ లైఫ్ లో కూడా డిఫరెంట్ గా ఉండటానికి ట్రై చేస్తున్నారు.

బాబోయ్..! ఈ స్టార్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ..! గుండుతో ఉన్న ఈ టాలీవుడ్ నటిని గుర్తుపట్టారా.? .
Actress

Updated on: Apr 11, 2025 | 3:54 PM

చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లో పాత్రల కోసం ఎలాంటి సాహసమైన చేస్తారు. కొంతమంది పాత్రల కోసం మునుపెన్నడూ చేయని ప్రయోగాలు చేస్తుంటారు. మరికొంతమంది తమ లుక్ ను పూర్తిగా మార్చేసుకుంటారు. ఛాలెంజింగ్ రోల్ వస్తే దాన్ని వాడుకోకుండా ఎంతో కష్టపడి ఆ పాత్రను రక్తికట్టిస్తారు. అయితే కొంతమంది సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ డిఫరెంట్ గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారు. అందరిలా కాకుండా ఒక అడుగు ముందుకేసి కొత్తగా ఉండేందుకు ట్రై చేస్తారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. పైన కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఊహించని విధంగా గుండుతో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. అందం, అభినయం ఉన్న స్టార్ హీరోయిన్ ఆమె.. ఆమె ఎవరో కనిపెట్టరా.? కనిపెట్టలేకపోతున్నారా..? సరే మీకోసం ఓ క్లూ.. ఆమె ఓ స్టార్ హీరోయిన్ సిస్టర్.

పై ఫొటోలో గుండుతో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు నటి శాంతి ప్రియా.. ఆమె సీనియర్ నటి భానుప్రియ సిస్టర్.. శాంతిప్రియ తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించింది. శాంతిప్రియ తన సినీ జీవితాన్ని 1987లో తెలుగు చిత్రం “కబోయే అల్లుడు”తో ప్రారంభించింది. అదే సంవత్సరం తమిళ చిత్రం “ఎంగ ఊరు పాటుక్కారన్”తో తమిళంలోకి అడుగుపెట్టింది. ఇక తెలుగులో “మహర్షి”, “సింహస్వప్నం”, “అగ్ని” వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో “సౌగంధ్” సినిమాతో అక్షయ్ కుమార్ సరసన తొలిసారి కనిపించింది. ఆమె కెరీర్‌లో “ఎంగ ఊరు పాటుక్కారన్” (1988) అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

శాంతిప్రియ 1999లో నటుడు సిద్ధార్థ రాయ్‌ను వివాహం చేసుకుంది, వీరికి ఇద్దరు కొడుకులు. 2004లో సిద్ధార్థ గుండెపోటుతో మరణించాడు. ఆమె సరోజిని నాయుడు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఓ చిత్రంతో మళ్లీ సినీ రంగంలోకి రీఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శాంతిప్రియ రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు. అంతే కాదు గ్లామర్ లుక్ తోనూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా విడుదల చేసిన గుండు ఫొటోల్లోనూ అందాలతో ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.