Movie News : ఈ పోస్టర్‌లో ఉన్న నటుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.! మీ ఊహకందడు

టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా వచ్చిన వారిలో చాలా మంది ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కుర్రాడు ఇండస్ట్రీలో ఎదగాలని చూస్తున్నారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టరా..? ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ మూవీలో నటించాడు. తన నటనతో అందరిని ఫిదా చేశాడు ఈ కుర్రాడు. ఇంతకు ఆతను ఎవరో గుర్తుపట్టరా..?

Movie News : ఈ పోస్టర్‌లో ఉన్న నటుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.! మీ ఊహకందడు
Movie News

Updated on: Nov 17, 2023 | 12:43 PM

సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే అంతా సులభం కాదు. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలబడాలి. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. అలా వచ్చిన వారిలో చాలా మంది ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కుర్రాడు ఇండస్ట్రీలో ఎదగాలని చూస్తున్నారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టరా..? ఇటీవలే ఓ బ్లాక్ బస్టర్ మూవీలో నటించాడు. తన నటనతో అందరిని ఫిదా చేశాడు ఈ కుర్రాడు. ఇంతకు ఆతను ఎవరో గుర్తుపట్టరా..? సరే మీకోసం ఓ క్లూ కొరియోగ్రాఫర్ నుంచి ఇప్పుడు నటుడిగా ఎదుగుతున్నాడు ఈ యంగ్ టాలెంట్. ఇంతకు అతను ఎవరంటే.

పై ఫొటోలో ట్రాన్స్ జెండర్ లా రెడీ అయిన నటుడు ఎవరో కాదు కొరియో గ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న శాండీ. డాన్సర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత కొరియోగ్రాఫర్ గా మారి ఆకట్టుకున్నాడు. స్టార్ కొరియోగ్రాఫర్ గా పలుసినిమాలకు పని చేశాడు శాండీ. ముఖ్యంగా దళపతి విజయ్ సినిమాలకు పని చేశాడు.

ఇక రీసెంట్ గా దళపతి విజయ్ నటించిన లియో సినిమాలో నటించాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శాండీ సైకో విలన్ గా కనిపించడు. కోల్డ్ కాఫీ అనే ఒకే ఒక్క డైలాగ్ తో పాపులర్ అయ్యాడు. లియోలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న శాండీ. ఇప్పుడు నటుడిగా మరో మెట్టు ఎక్కనున్నాడు. శాండీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా రాజీ. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ట్రాన్స్ జెండర్ లుక్ లో కనిపించాడు ఈ క్రేజీ క్రొరియోగ్రాఫర్. ఈ లుక్ ను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ పోస్టర్ ను పంచుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.