
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ హీరోలు ఉన్నారు. వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు ఒకరు. అతని సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. సైలెంట్ హిట్స్ అందుకుంటున్నాడు ఆ టాలెంటడ్ హీరో.. అంతే కాదు తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ అవార్డులను కూడా అందుకుంటున్నాడు. ఇటీవలే గద్దర్ అవార్డును కూడా అందుకున్నాడు. ఇంతకూ ఆతను ఎవరో గుర్తుపట్టారా.? సినిమాల్లో హీరోగా రాక ముందు నాటకాల్లో నటించి మెప్పించాడు. తన నటనతో గద్దర్ అన్నాను ఫిదా చేశాడు. ఇక ఇప్పుడు గద్దర్ అవార్డును అందుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు. తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు తిరువీర్.
హీరో తిరువీర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటుడు, దర్శకుడు, సినిమా నటుడు కూడా.. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలోని లలన్ సింగ్, అలాగే 2020లో వచ్చిన పలాస 1978 సినిమాలోని రంగారావు పాత్రలతో గుర్తింపు పొందాడు తిరువీర్. 2022లో వచ్చిన మసూద సినిమాలో తొలిసారిగా హీరోగా నటించాడు. ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లోకి రాక ముందు చాలా నాటకాల్లో నటించాడు.
టాక్స్ ఫ్రీ, జూ స్టొరీ, లా ఒక్కింతయు లేదు, కిషోర్ శాంతభాయ్ కాలే, న్యూ భారత్ కేఫ్, బర్బరీకుడు, ఎకనామిక్ హిట్ మాన్, ఆంటిగని, కాయితం పులి, కళ్యాణి, వర్ణ నిర్మూలన సిద్ధాతం, దావత్ మొదలైన నాటకాలలో నటించాడు. బంగ్లాదేశ్, జపాన్, ద. కొరియా దేశాల్లోనూ నాటక ప్రదర్శనలు ఇచ్చాడు తిరువీర్. ఇక ఇటీవలే ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు గాను గద్దర్ అవార్డును అందుకున్నాడు తిరువీర్. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.