Kantara: కాంతార సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరో తెలుసా..? అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

|

Dec 14, 2022 | 6:30 AM

ఇలా చాలా మంది చిన్న వయసులోనే తల్లి పాత్రలు చేసిన వారు ఉన్నారు. ఇక ఇటీవల వచ్చిన కాంతారా సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Kantara: కాంతార సినిమాలో హీరో తల్లిగా నటించింది ఎవరో తెలుసా..? అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Kantara
Follow us on

కొన్ని సార్లు నటీ నటులు తమ వయసుకు మించిన పాత్రలు చేయాల్సి వస్తుంది. నటనకు ప్రాధాన్యత ఉంటే తప్పకుండా ఆపాత్రలు చేయడానికి వెనకడుగేయారు. ఇలా చాలా మంది చిన్న వయసులోనే తల్లి పాత్రలు చేసిన వారు ఉన్నారు. ఇక ఇటీవల వచ్చిన కాంతార సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో 20 నిముషాలు ప్రేక్షకులను సీట్ అంచున కూర్చోపెడుతుంది. ఇక ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి తల్లిగా నటించిన నటి ఎవరో తెలుసా..? ఆమె బయట ఎలా ఉంటుందో తెలుసా.?

ఆమె పేరు మానసి సుధీర్ . కాంతార సినిమాలో హీరో తల్లి కమల అనే పాత్రలో నటించింది. సినిమాలో ఆమె చాలా వయసున్న పాత్రలో నటించింది కానీ బయట చాలా యంగ్. సినిమా ఈమె నటనను చూసి అంతా ఈమెను సీనియర్ నటి అని కూడా అనుకుంటున్నారు. కానీ కాదు. ఆమె టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేది.

ఇవి కూడా చదవండి

కరోనా సమయంలో ఆమె చేసిన టిక్ టాక్ వీడియోలు బబాగా పాపులర్ అయ్యాయి. ఆ వీడియోలు చూసే ఆమెను ఈ సినిమా కోసం  సెలక్ట్ చేసుకున్నారు. మానసి సుధీర్ వయసు 35 ఏళ్ళు. కానీ కాంతార సినిమాలో 39ఏళ్ల వయసున్న రిషబ్ శెట్టికి తల్లిగా నటించింది. ఇక కాంతార సినిమా తర్వాత మానసి సుధీర్ కు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక మానసి సుధీర్ బ్యూటిఫుల్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..