Burj Khalifa: దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు ఎవరో తెలుసా? అన్ని కోట్లు ఖర్చు పెట్టి..

దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచలోనే అతి ఎత్తైన కట్టడంగా దీనికి గుర్తింపు ఉంది. దుబాయ్ కు వెళ్లిన వారందరూ దీనిని సందర్శించి రావాల్సిందే. అయితే ఈ ఎత్తైన కట్టడంలో ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేశాడు ఒక ఇండియన్ సూపర్ స్టార్.

Burj Khalifa: దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు ఎవరో తెలుసా? అన్ని కోట్లు ఖర్చు పెట్టి..
Burj Khalifa

Updated on: Jun 10, 2025 | 2:05 PM

దుబాయ్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బుర్జ్ ఖలీఫానే. సుమారు 828 మీటర్ల ఎత్తు, 163 అంతస్తుల ఈ భవనం దుబాయ్‌లోనే కాదు, ప్రపంచంలోనే ఎత్తైన భవనం. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణ పనులు 2010లో పూర్తయ్యాయి. అంటే సుమారు ఆరేళ్ల పాటు శ్రమించి ఈ భవనాన్ని కట్టారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా దుబాయ్ కు వెళితే ఈ బుర్జ్ ఖలీఫాను సందర్శించాల్సిందే. భవనం దగ్గర నిలబడి సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవాల్సిందే. అలాంటి ఈ ఎత్తైన కట్టడంలో పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. అలా బుర్జ్ ఖలీఫాలో ఒక భారతీయ నటుడు సింగిల్ బెడ్ రూమ్‌ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాడు. అయితే దీనిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇదొక్కటే కాదు.. దుబాయిలోనే ఉన్న మరో పెద్ద విల్లాలోని 3 బీహెచ్‌కే ఫ్లాట్ కూడా ఈ సూపర్ స్టార్ కొనుగోలు చేశాడు. ఇలా మొత్తానికి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడిగా రికార్డు సృష్టించినది ఎవరో తెలుసా? అతను మరెవరో కాదు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్.

అవును మోహన్ లాల్ గతంలో బుర్జ్ ఖలీఫాలోని 29వ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్ రూమ్ ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ తర్వాత దీనిని తన భార్య సుచిత్ర పేరిట రిజిస్టర్ చేయించాడు. కాగా తెలుగు నటుల్లోనూ మహేశ్ బాబు, అల్లు అర్జున్‌కి కూడా దుబాయిలో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేశారని ప్రచారం ఉంది. అయితే వీటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

కన్నప్ప సినిమాలో మోహన్ లాల్..

మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే.. ఆ మధ్యన వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడీ సూపర్ స్టార్. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళుతున్నాడు. ఇటీవల మోహన్ లాల్ నటించిన ఎల్ 2 ఎంపురాన్, తుడరమ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి.

భార్య సుచిత్రతో మోహన్ లాల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.