AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: స్టార్ హీరోయిన్ ఒంటిపై ఏకంగా 200 కిలోల బంగారు ఆభరణాలు.. సెక్యూరిటీగా 50 మంది బాడీ గార్డ్స్

గతంలోలా ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడం లేదు. అయితేనేం తన అందంతో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుందీ అందాల తార. 50 ప్లస్ వయసున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ చాలా మందికి ఫేవరేట్ హీరోయిన్ అని చెప్పవచ్చు.

Tollywood: స్టార్ హీరోయిన్ ఒంటిపై ఏకంగా 200 కిలోల బంగారు ఆభరణాలు.. సెక్యూరిటీగా 50 మంది బాడీ గార్డ్స్
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 10, 2025 | 3:08 PM

Share

కోట్లు పోయినా పర్వాలేదు సినిమా లో క్వాలిటీ బాగుండాలన్నది చాలామంది నిర్మాతల అభిప్రాయం. వీరు తమ సినిమాలు రిచ్ గా, స్టైలిష్ గా రావాలని కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. రకరకాల సెట్లు, ఫారిన్ లొకేషన్లు.. హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్.. తదితరాల కోసం మంచి నీళ్ల ప్రాయంలా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. ఉదాహరణకు దీపికా పదుకొనే నటించిన రామ్ లీలా సినిమా విషయానికి వస్తే.. ఇందులో ఆమె 30 కిలోల లెహంగా ధరించింది. అలాగే ‘పద్మావత్’ లోని ‘ఘూమర్’ పాట కోసం కూడా ఆమె భారీ లెహంగా ధరించింది. ఆభరణాలతో సహా లెహంగా మొత్తం బరువు 30 కిలోలు. అయితే అంతకు మించి ఉండేలా ఈ స్టార్ హీరోయిన్ తన ఒంటిపై ఏకంగా 200 కిలోల బంగారు ఆభరణాలను ధరించింది. అంతేకాదు భద్రత కోసం 50 మంది బాడీగార్డ్‌లను కూడా నియమించారు. ఆమె మరెవరో కాదు మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్. 2008లో ఆమె పీరియాడికల్ సినిమా చేసింది. ఈ 3 గంటల 33 నిమిషాల సినిమాలో ఐశ్వర్యతో పాటు గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కూడా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది. ప్రపంచవ్యాప్తంగా 106.68 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే భారతదేశంలో 55.91 కోట్లు కలెక్ట్ చేసింది.

45 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ‘జోధా అక్బర్’ చిత్రంలో ఐశ్వర్య రాయ్ మహారాణి జోధా పాత్రను పోషించింది. దీని కోసం ఆమె నకిలీ కాకుండా నిజమైన బంగారు ఆభరణాలను ధరించింది.ఈ సినిమా కోసం ఐశ్వర్యారాయ్ ఏకంగా 200 కిలోల బంగారు ఆభరణాలను ధరించిందట. వీటిని మొత్తం 70 మంది కళాకారులు తయారు చేశారట. బంగారంతో పాటు, ముత్యాలు, ఇతర విలువైన లోహాలను కూడా ఇందులో ఉపయోగించారు. ఈ ఆభరణాలతో ఐశ్వర్య మహారాణి జోధాబాయి పాత్రకు మరింత పేరొచ్చింది.

‘జోధా అక్బర్’ సినిమా విడుదలైన తర్వాత ఐశ్వర్య రాయ్ ఆభరణాలు బాగా ప్రశంసలు అందుకున్నాయి. అదే డిజైన్ ఉన్న ఆభరణాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఐశ్వర్య 200 కిలోల బంగారు ఆభరణాలు ధరించినప్పుడు, ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి ఆమె వెంట సుమారు 50 మంది భద్రతా సిబ్బంది ఉండేవారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అరుణ్, సోను సూద్, పూనమ్ సిన్హా తదితరులు కూడా ప్రధాన పాత్రలు పోషించారు.

కేన్స్ లో ఐశ్వర్యా రాయ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత