
నేచురల్ నాని కెరీర్ లో మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో నిన్ను కోరు మూవీ ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో నానికి జోడీగా నివేదా థామస్ నటించింది. అలాగే ఈ సినిమాలో మరో హీరోగా ఆది పినిశెట్టి నటించారు. అందమైన ప్రేమ కథ, ఎమోషన్స్, కావాల్సినంత కామెడీతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాలోని పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాలో నాని నటన అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే కథనంతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంది ఈ సినిమాలో అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా నివేద థామస్ ను అనుకోలేదట.ఆమె ప్లేస్ లో మరో హీరోయిన్ ను అనుకున్నారట దర్శకుడు శివ నిర్వాణ.
అయితే నిన్ను కోరి సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ , నాని కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉందట. కానీ అలా జరగలేదు. కానీ అప్పుడు కాజల్ వరుస సినిమాలతో బిజీ కావడంతో నిన్ను కోరి సినిమాకు నో చెప్పారట కాజల్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..