అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప -2’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాలో.. ఫహద్ ఫైజల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ, దివి వడ్త్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఈ మూవీలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది ఓ బాలీవుడ్ నటి. పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఆ సీన్‌లో పుష్పరాజ్ ఎర్రచందనం ఇంటర్నేషనల్ డీల్ చేస్తాడు. ఆ డీల్‌లో సదరు వ్యక్తితో వచ్చిన చిన్నది.. ఈ బాలీవుడ్ హీరోయిన్. ఆమె ఎవరు.? ఇన్‌స్టా ఐడీ ఏంటి.? లాంటి వివరాల కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..
ఆమె మరెవరో కాదు.. ఆంచల్ ముంజల్. బీ-టౌన్ టెలివిజన్, పలు చిత్రాల్లో నటించింది ఈ అందాల భామ. చైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెరకు పరిచయమైన ముంజల్.. 2008లో ‘ధూమ్ మచావో ధూమ్’ అనే సిరీస్‌తో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2010లో ‘వి ఆర్ ఫ్యామిలీ’ అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఇందులో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి.. అందరి దృష్టిని ఆకర్షించింది. ‘ఘోస్ట్ బనా దోస్త్’, ‘పర్వర్రిష్’, ‘గుమ్రః’, ‘వెల్కమ్’, ‘బడే అచ్చే లగ్తే హాయ్’, ‘ప్రెట్ బాయ్స్’ లాంటి టీవీ షోలలో నటించిన ఈమె.. ‘ఘాయల్: ఒన్స్ అగైన్’, ‘ఆరక్షన్’, ‘ముంబై స్పెషల్ 6’ వంటి చిత్రాల్లో కనిపించింది. అలాగే తమిళంలో ‘సే’ అనే చిత్రం చేసింది.
ఇక ఇప్పుడు ‘పుష్ప-2’ మూవీతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో ఈ అమ్మడు కనిపించింది ఒక్క సీన్ అయినప్పటికీ.. కుర్రాళ్ల ఈమె కోసం సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. అటు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ.. కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది. లేట్ ఎందుకు ఆమె ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
ఇది చదవండి: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి