Pushpa 2: పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..? ఆ గ్లాస్ స్టెప్ కంపోజర్..

|

May 03, 2024 | 8:15 AM

ఒక్కసారిగా ఈ మూవీ పై మరింత అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే.. మే 1న రిలీజ్ అయిన పుష్ప పుష్ప పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పుష్ప.. పుష్ప అంటూ సాగే పాటలో బన్నీ డాన్స్.. పుష్పరాజ్ మ్యానరిజం అదిరిపోయాయి. ముఖ్యంగా ఈ పాటలో బన్నీ వేసిన హుట్ స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

Pushpa 2: పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..? ఆ గ్లాస్ స్టెప్ కంపోజర్..
Allu Arjun
Follow us on

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన పుష్ప చిత్రానికి కంటే సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ హైప్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. దీంతో పుష్ప ది రూల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది చిత్రయూనిట్. ఈసినిమా కోసం సౌత్, నార్త్ అడియన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై క్యూరియాసిటిని కలిగించాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ అదిరిపోయింది. ఒక్కసారిగా ఈ మూవీ పై మరింత అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే.. మే 1న రిలీజ్ అయిన పుష్ప పుష్ప పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పుష్ప.. పుష్ప అంటూ సాగే పాటలో బన్నీ డాన్స్.. పుష్పరాజ్ మ్యానరిజం అదిరిపోయాయి. ముఖ్యంగా ఈ పాటలో బన్నీ వేసిన హుట్ స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

గతంలో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటలో నడుస్తూ చెప్పు వదిలేసిన స్టెప్ ఎంతగా పాపులర్ అయ్యిందో ఇప్పుడు పుష్ప 2లోని షూ వదిలేసే స్టెప్ కూడా అంతే పాపులర్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్ప పాటకు డాన్స్ చేస్తూ షూ స్టెప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన అదే స్టెప్ కనిపిస్తుంది. మరోసారి నెట్టింట షూ వదిలేసిన స్టెప్ వైరలవుతుంది. అయితే ఇప్పుడు ఆ ఫేమస్ షూ స్టెప్ కొరియోగ్రాఫర్ ఎవరనేది తెలిసిందే. పుష్ప 2 చిత్రానికి డాన్స్ మాస్టర్లుగా ప్రేమ్ రక్షిత్, శ్రేష్టి వర్మ, గణేష్, ఆచార్య, విజయ్ పోలాకి వర్క్ చేస్తున్నారు. అయితే ఈ టైటిల్ పాటలోని షూ హుట్ స్టెప్ ను విజయ్ పోలాకి కంపోజ్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో తెలిపారు. పుష్ప ది రూల్ కోసం నా సిగ్నేచర్ హుక్ స్టెప్ చూడండంటూ విజయ్ తన ఇన్ స్టాలో రీల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇక ఈ వీడియోకు రియాక్ట్ అవుతూ విజయ్ పోలాకి డాన్స్ పై రియాక్ట్ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్. తమ అభిమాన హీరోతో అదిరిపోయే స్టెప్ వేయించావని.. ఆల్ ది బెస్ట్ ఫర్ యూవర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పుష్ప పాటలో షూ హుక్ స్టెప్ మాత్రం నెట్టిటం తెగ వైరలుతుంది. అయితే ఈ పాటలోని గ్లాస్ స్టెప్ కూడా విజయ్ పోలాకి కోరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప పాటలకు రీల్స్ చేస్తూ ఇన్ స్టాలో షేర్ చేస్తున్నారు విజయ్. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో భాషల్లో ఈ పాటను రిలీజ్ చేసారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.