
2025 సంవత్సరంలో చాలా సినిమాలు రిలీజయ్యాయి. ఇందులో భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. లో బడ్జెట్ మూవీస్ కూడా ఉన్నాయి. అయితే భారీ అంచనాలతో రిలీజైన పెద్ద సినిమాలు అనూహ్యంగా బోల్తా పడ్డాయి. అదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన చిన్న సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. ఈ ఏడాది విజయం సాధించిన పెద్ద సినిమాల్లో ధురంధర్, చావా, సైయారా కాంతారా చాప్టర్ 1 అని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. కానీ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఓ ప్రాంతీయ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం రూ. 50 లక్షల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం 2025లో అత్యధిక లాభాలు ఆర్జించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 120 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్ తో పోలిస్తే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయి. అలాగనీ ఈ సినిమాలో స్టార్ నటీనటులు లేరు. స్పెషల్ సాంగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ లు లేవు. వీఎఫ్ ఎక్స్ హంగులు లేవు.
ఇలా కమర్షియల్ హంగులు లేనప్పటికీ ప్రేక్షకులు ఈ సినిమాను తెగ చూసేశారు. త్వరలోనే ఈ మూవీ తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ బ్లాక్ బస్టర్ మూవీ హిందీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘లాలో- కృష్ణ సదా సహాయతే’. ఇదొక గుజరాతీ మూవీ. అంకిత్ సఖియా తెరకెక్కించిన ఈ మూవీలో రీవా రచ్, శ్రుహద్ గోస్వామి, కరణ్ జోషి, మిష్టి కడేచా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ కథంతా ఓ రిక్షా డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా ఇతర భాషల్లోనూ రిలీజ్ కానుంది.
LAALO- KRISHNA SADA SAHAAYATE TO RELEASE IN HINDI ON 9TH JAN 2026#ankitsakhiya #ankitsakhiyaofficial #laalokrishnasadasahayate #krishna #reevarachh #shruhadgoswami #karanjoshi #mishtykadabba #anshujoshi #laalokrishnasadasahaayatereview #moviemanblogger@moviemanblogger pic.twitter.com/PFRNR35clh
— Moवीमॅనబ్లోக்અર (@moviemanblogger) December 25, 2025