AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం సినిమా రా అయ్యా..! పరమ చెత్త మూవీ.. రూ.1400కోట్లు పెడితే.. టీ ఖర్చులు కూడా రాలేదు..

రీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుంది. ఏ ఇండస్ట్రీ చూసినా పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు ఊహించని విధంగా కొన్ని బోల్తాకొడుతుంటాయి.

ఏం సినిమా రా అయ్యా..! పరమ చెత్త మూవీ.. రూ.1400కోట్లు పెడితే.. టీ ఖర్చులు కూడా రాలేదు..
Movie News
Rajeev Rayala
|

Updated on: May 30, 2026 | 11:36 AM

Share

సినిమా హిట్ ఫ్లాప్ అనేది మేకర్స్ చేతిలో ఉండు.. కేవలం ప్రేక్షకుడు మాత్రం సినిమా రిజల్ట్ డిసైడ్ చేస్తాడు. ఎంతమంది రివ్యూలు రాసినా.. ప్రమోషన్స్ లో సినిమాలను ఎంత లేపిన ఫైనల్ గా ఆడియన్స్ చేతిలోనే సినిమా జాతకం ఉంటుంది. భారీ బడ్జెట్ పెట్టి, స్టార్ హీరోలు, హీరోయిన్స్ పెట్టి సినిమా తీసిన కొన్నిసార్లు డిజాస్టర్ అవుతుంటాయి. అలాగే ఎలాంటి అంచనాలు లేకూండా వచ్చిన చిన్న సినిమాలు ఊహించని విధంగా విజయాలను అందుకునుటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో విజయాలను అందుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఓ సినిమా సినీ ప్రపంచంలోనే చెత్త సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఎంత డిజాస్టర్ అంటే కనీసం సినిమాలో నటించిన ఓ స్టార్ యాక్టర్ రెమ్యునరేషన్ కూడా రాబట్టలేకపోయింది.

ఇది కూడా చదవండి : బాలయ్య సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్‌గా హీరోయిన్‌గా చేసిన ఏకైక నటి.. ఆ కుర్రాడు కూడా హీరోనే

ఈ సినిమా చిన్న సినిమా కాదు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. 1400 కోట్లు పెట్టి సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు.. కట్ చేస్తే రూ.6కోట్లు రాబట్టింది.. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో.. ఆ సినిమా మరేదో కాదు.. ఆ సినిమా పేరు డెజర్ట్ వారియర్. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. ఈ సినిమాలో మార్వెల్ స్టార్ ఆంథోనీ మాకీ, లెజెండరీ నటుడు బెన్ కింగ్స్లీ వంటి చాలా మంది నటించారు.

ఇది కూడా చదవండి : Folk Song: ఏం పాట మావ..! అమ్మాయిలు తెగ పాడుకుంటున్న సాంగ్.. వచ్చి 5 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే

ఈ సినిమాను సౌదీ అరేబియా MBC గ్రూప్ నిర్మించింది. ఈ సినిమాకు రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫేమ్ రూపెర్ట్ వ్యాట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డబుల్ డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు కూడా హాలీవుడ్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఉన్నప్పటికీ డెజర్ట్ వారియర్ వాటిని మించి డిజాస్టర్ అయ్యింది. 2026 ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఏకంగా 99.6 శాతం పెట్టుబడి నష్టపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Shruti Haasan: ఆ సాంగ్ వల్ల.. నన్ను ఇష్టపడని వారు కూడా నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us