అందరివాడు.. చిరంజీవి కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ఇదొకటి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయినా.. కమర్షియల్‌గా సక్సెస్ సాధించింది. 2005లో విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి డ్యుయల్ రోల్‌లో నటించారు. టబు, రిమి సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన రిమి సేన్ గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది.? ఎలా ఉందో.? తెలుసుకుందామా..
హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించిన రిమి సేన్.. చిన్నప్పటి నుంచి నటిని అవ్వాలని కలలు కన్నది. అనుకున్నట్టుగా చదువు పూర్తి చేసుకున్న తర్వాత కోల్‌కతా నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది. రిమి సేన్ అసలు పేరు సుభమిత్ర సేన్. ‘పరోమితర్ ఏక్ దిన్’ అనే బెంగాలీ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అందాల భామ. ఆ తర్వాత తెలుగులో ఇదే నా మొదటి ప్రేమలేఖ(2001) సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత నీ తోడు కావాలి(2002), అందరివాడు(2005) తెలుగు చిత్రాలలో నటించింది. హిందీలో ధూమ్(2004), క్యోన్ కి(2005), గరం మసాలా(2005), గోల్‌మాల్(2006) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
2015లో బిగ్ బాస్, బిగ్ బ్రదర్ రియాల్టీ షోలలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. అలాగే కెరీర్ తొలినాళ్లలో అమీర్ ఖాన్‌తో కోకో-కోలా యాడ్‌లో నటించింది రిమి సేన్. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అందంతో కుర్రకారు మతిపోగొడుతోంది. లేట్ ఎందుకు మీరూ ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.
ఇది చదవండి: దేవర మూవీలో ఎన్టీఆర్ భార్యగా నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. అస్సలు ఊహించి ఉండరు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి