AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess The Actor: సీనియర్ హీరోయిన్ శోభన పక్కన ఉన్న హీరోను గుర్తుపట్టారా ?.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటంటే..

హీరోయిన్ గానే కాదు.. క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగుతూనే.. మరోవైపు ఎంతోమందికి సంప్రదాయ నృత్యంలో శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం కూడా సొంతంగా నృత్య శిక్షణ కేంద్రాన్ని కూడా నడుపుతున్నారు.

Guess The Actor: సీనియర్ హీరోయిన్ శోభన పక్కన ఉన్న హీరోను గుర్తుపట్టారా ?.. ఆయన బ్యాగ్రౌండ్ ఏంటంటే..
Shobana
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2023 | 8:06 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రకథానాయికగా కొనసాగిన హీరోయినల్లో నటి శోభన ఒకరు. మెగాస్టార్ చిరంజీవి.. మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. శోభన.. పేరు చెప్పగానే సంప్రదాయమైన అందమైన తెలుగింటి అమ్మాయి ప్రతిబింబం తెలుగు ప్రేక్షకుల కళ్లముందుకు వస్తుంది. పాత్ర ప్రాధాన్యత.. సబ్జెక్ట్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్ చేయడంలో ఆమె ముందుంటుంది. హీరోయిన్ గానే కాదు.. క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా కొనసాగుతూనే.. మరోవైపు ఎంతోమందికి సంప్రదాయ నృత్యంలో శిక్షణ ఇచ్చింది. ప్రస్తుతం కూడా సొంతంగా నృత్య శిక్షణ కేంద్రాన్ని కూడా నడుపుతున్నారు. శోభన వయసు ప్రస్తుతం 52 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఓ పాపను దత్తత తీసుకుని ఆమెను పెంచుకుంటున్నారు.

ఇప్పటికీ శోభన నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. అటు సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తన నృత్య శిక్షణ కేంద్రానికి సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ షేర్ చేస్తుంటారు. ఇక ఇటీవల తన సోదరుడితో కలిసి ఓ ఫోటోను షేర్ చేసుకున్నారు. అందులో సంప్రదాయ నృత్యానికి సంబంధించిన కాస్టూమ్స్ ధరించి ఉన్నారు. అయితే.. శోభన సోదరుడు కూడా ఫేమస్ నృత్య కళాకారుడు. అన్నింటికి మించి తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరో. పైన ఫోటోను చూశారు కదా. ఆ హీరోను మీరు గుర్తుపట్టారా..

ఇవి కూడా చదవండి

వినీత్.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరో. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇండస్ట్రీలలో పలు చిత్రాల్లో నటించారు. 1994 సరిగమలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత అబ్బాస్‏తో కలిసి నటించిన ప్రేమ దేశం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాలాపానీ, రుక్మిణి, నీ ప్రేమకై.. లాహిరి లాహిరి లాహిరిలో .. చంద్రముఖి చిత్రాల్లో నటించారు. ఇటీవల నితిన్ నటించిన రంగ్ దే సినిమాలో కనిపించారు వినీత్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.