AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mammootty: మమ్ముట్టి కుమార్తెగా, ప్రియురాలిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా.. ?

మలయాళీ చిత్రపరిశ్రమలో అతడు స్టార్ హీరో. దశాబ్దాలుగా అనేక సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. కానీ మీకు తెలుసా.. ? ఓ హీరోయిన్ మమ్ముట్టికి కూతురిగా, ప్రియురాలిగా, తల్లిగా నటించింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Mammootty: మమ్ముట్టి కుమార్తెగా, ప్రియురాలిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా.. ?
Mammootty
Rajitha Chanti
|

Updated on: May 21, 2025 | 6:26 PM

Share

మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగులో డబ్ చేయగా మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. ఇప్పటికీ హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మమ్ముట్టికి కూతురిగా, ప్రియురాలిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమెకు తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో హిట్ చిత్రాల్లో కనిపించిన ఆమె.. ఆ తర్వాత కథానాయికగా సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఆమె. ఇప్పటికీ సినీరంగంలో చాలా చురుగ్గా ఉంటుంది. అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు వయసుకు తగిన పాత్రలు పోషిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా. ? తనే హీరోయిన్ మీనా.

1984లో పి.జి దర్శకత్వం వహించిన ‘ఒరు కొచ్చు కథ నీయదా పరాయత్త కథ’ చిత్రంలో మీనా మమ్ముట్టి కుమార్తెగా నటించింది. ఆ సినిమాలో మమ్ముట్టికి కూతురితో సమానమైన పాత్ర పోషిచింది. ఆ సినిమాలో మీనాకు తండ్రిగా కనిపించారు మమ్ముట్టి. ఆ తర్వాత ఆయనకే తల్లి పాత్రలో కనిపించింది. కేవలం మమ్ముట్టికే కాదు..రజినీకాంత్ కూతురిగా, భార్యగా కనిపించింది. అలాగే చిన్నప్పుడు బాలకృష్ణతో నటించి.. ఆ తర్వాత ప్రియురాలిగా కనిపించింది. మలయాళంలో రాక్షస రాజా, కరుత పక్షులు, కథా పరియంబోల్ వంటి చిత్రాల్లో మమ్ముట్టితో జత కట్టింది మీనా.

చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన మీనా.. చిన్న వయసులోనే మమ్ముట్టికి కూతురిగా కనిపించింది. ఆ తర్వాత మమ్ముట్టికి ప్రియురాలిగా కనిపించింది. అలాగే ఫ్రెండ్ సినిమాలో మమ్ముట్టి తల్లిగా కనిపించింది. ఇందులో మమ్ముట్టి నజీబ్ పాత్రలో కనిపించారు. దక్షిణాదిలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించింది మీనా.

ఇవి కూడా చదవండి :  

Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..

Tollywood: రస్నా యాడ్‏లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?

Tollywood: అప్పుడు ఐశ్వర్య రాయ్‏కే చెమటలు పట్టించింది.. కట్ చేస్తే.. ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్..

Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత