
సినిమా పరిశ్రమలో కొన్నిసార్లు చిత్రాలు చేతులు మారుతూ ఉంటాయి. అగ్ర హీరోల విషయంలో చాలాసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో హిట్ అందుకున్నారు. అలాగే కొందరు స్టార్స్ ఖాతాలో పడాల్సిన ప్లాపులు మరొకరి ఖాతాలో పడ్డాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్, రవితేజ విషయంలోనూ ఇలాగే జరిగింది. మాస్ మాహారాజా చేయాల్సిన సినిమాతో తారక్ భారీ విజయాన్ని అందుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? అదే టెంపర్. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. 35 కోట్లతో నిర్మించిన ఈ మూవీ అప్పట్లోనే రూ.75 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ సినిమాతో మరోసారి మాస్ హీరోగా అదరగొట్టారు తారక్. ఇందులో కాజల్ కథానాయికగా నటించింది. ఈ సినిమాను హిందీ, తమిళంలో రీమేక్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాను రవితేజ చేయాల్సిందట. కానీ అనుహ్యంగా తారక్ వద్దకు వచ్చిందట.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
2014లో ఈ సినిమాను రవితేజ చేయాలనుకున్నారట డైరెక్టర్ మెహర్ రమేశ్. కానీ ఆ సమయంలో వక్కంతం వంశీ చెప్పిన ఈ మూవీ కథ నచ్చడంతో పవర్ అనే టైటిల్ ఫిక్స్ చేసి సినిమాను రూపొందించాలనుకున్నరాట. కానీ ఈ సినిమా కొన్నాళ్లకే ఆగిపోయింది. ఆ తర్వాత ఈ మూవీ స్టోరీ ఎన్టీఆర్, పూరి వద్దకు వచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం వార్ 2 చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చారు. హృతిక్ రోషన్, తారక్ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..