OTT movie: ఉత్కంఠమైన యాక్షన్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే..

మనుగడ కోసం చేసే పోరాటం.. ఇప్పుడు ఈ జానర్ చిత్రమే ఓటీటీ దూసుకుపోతుంది. ఊహించని మలుపులు.. యాక్షన్ సీన్ ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ దుమ్మురేపుతుంది. ఈ చిత్రానికి 7.8 IMDb రేటింగ్ ఉంది. కానీ మీకు ఒక విషయం.. ఈ సినిమా ఒంటరిగా చూడాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి.

OTT movie: ఉత్కంఠమైన యాక్షన్ థ్రిల్లర్.. ఒంటరిగా చూడలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే..
Train To Busan

Updated on: Jun 18, 2025 | 10:16 PM

ప్రస్తుతం ఓటీటీలో వివిధ జానర్ చిత్రాలు సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే పలు భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అలా రిలీజ్ అయిన సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా జాంబీ థ్రిల్లర్ సినిమా. దాదాపు ఒక గంట 58 నిమిషాల యాక్షన్ థ్రిల్లర్ సినిమా మిమ్మల్ని థ్రిల్ చేయడం ఖాయం. మనుగడ కోసం పోరాటాన్ని హైలైట్ చేసే థ్రిల్లర్ చిత్రం ఇది. ఊహించని మలుపు, యాక్షన్ సీన్స్ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ చిత్రానికి 7.8 IMDb రేటింగ్ ఉంది. అలాంటి ఒక చిత్రం ‘ట్రైన్ టు బుసాన్’. దక్షిణ కొరియా సినిమా ఇది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

ట్రైన్ టు బుసాన్’ అనేది 2016లో దక్షిణ కొరియాలో విడుదలైన చిత్రం. దర్శకుడు యోన్ చాంగ్ జోంబీ వైరస్ దాడి కారణంగా జరిగే సంఘటనల గురించి తెరకెక్కించారు. ఈ చిత్రం పూర్తిగా రైలులో జరిగే కథ. ఒక తండ్రి (కథానాయకుడు) తన చిన్న కూతురితో కలిసి తమ తల్లిని చూడటానికి రైలు ఎక్కుతాడు. కానీ రైలు బయలుదేరడానికి కొన్ని నిమిషాల ముందు, వైరస్ సోకిన ఒక మహిళ తెలియకుండానే రైలు ఎక్కుతుంది. ఆ మహిళ నుండి ఇన్ఫెక్షన్ కంపార్ట్‌మెంట్ అంతటా వ్యాపిస్తుంది. రైలు ముందుకు కదులుతున్న కొద్దీ, ప్రయాణీకులలో ఉద్రిక్తత పెరుగుతుంది. తన కూతురిని రక్షించుకోవడానికి తండ్రి చేసే పోరాటం ఒక వైపు, గర్భవతి అయిన భార్య కోసం ఓ వ్యక్తి చేసే పోరాటమే ఇది.

ఇద్దరూ కలిసి పెరుగుతున్న జాంబీల గుంపుతో పోరాడుతుంటారు. ఈ చిత్రంలోని భావోద్వేగ సన్నివేశాలు మిమ్మల్ని ఆద్యంతం కట్టిపడేస్తాయి. త్యాగం, భయం, ఆశ, ప్రేమ అన్ని భావోద్వేగాలు ఉత్కంఠ కలిగిస్తాయి. ‘ట్రైన్ టు బుసాన్’ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.841 కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..